భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్‌దే
దిశ, వెబ్‌డెస్క్: సిడ్ని వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఇండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 390 పరుగల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి 338/9 పరుగులు మాత్రమే చేసి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. మూడు వన్డేల సిరీస్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓడిపోవడంతో సిరీస్ ఆసిస్ కైవసం అయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 […]
దిశ, వెబ్‌డెస్క్: సిడ్ని వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఇండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 390 పరుగల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి 338/9 పరుగులు మాత్రమే చేసి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. మూడు వన్డేల సిరీస్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓడిపోవడంతో సిరీస్ ఆసిస్ కైవసం అయ్యింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 389 పరుగులు చేసింది. ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్ (104; 64 బంతుల్లో) మరోసారి మెరుపు సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (83; 77 బంతుల్లో), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (60; 69 బంతుల్లో) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. క్రితం మ్యాచ్‌లో సెంచురీ చేసిన ఫించ్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
390 భారీ లక్ష్యచేధనలో బ్యాటింగ్‌కి దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 338 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (89; 87 బంతుల్లో), కేఎల్ రాహుల్ (76; 66 బంతుల్లో) అర్ధశతకాలతో పోరాడిన టార్గెట్‌ను అందుకోలేకపోయింది. ఆ తర్వాత జడేజా(24), పాండ్యా(28) కూడా భారీ షాట్లకు ప్రయత్నించి వరుస బంతుల్లో ఔటయ్యారు. దాంతో భారత్ పోరాటం ముగిసింది. వరుసగా రెండు వన్డేల్లోనూ ఓడి, 2-0 తేడాతో వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది.