నిప్పులు చెరుగుతున్న భారత బౌలర్లు.. 38‌కే మూడు వికెట్లు

దిశ, వెబ్‌డెస్క్ :పింక్‌ బాల్ టెస్టులో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ – ఆస్ట్రేలియల మధ్య మెల్‌బోర్న్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. తొలత బ్యాటింగ్ కు దిగిన కంగారూ బ్యాట్స్ మెన్ ను భారత బౌలర్లు వణికిస్తున్నారు. బుమ్రా, అశ్విన్ లు పదునైన బంతులు వేస్తూ ఆసీస్ బౌలర్లను కంగారెత్తిస్తున్నారు. తొలిటెస్ట్ మ్యాచ్ గెలుపుతో జోరుమీదున్న బాక్సింగ్‌డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూ […]

Update: 2020-12-25 21:38 GMT

దిశ, వెబ్‌డెస్క్ :పింక్‌ బాల్ టెస్టులో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ – ఆస్ట్రేలియల మధ్య మెల్‌బోర్న్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. తొలత బ్యాటింగ్ కు దిగిన కంగారూ బ్యాట్స్ మెన్ ను భారత బౌలర్లు వణికిస్తున్నారు. బుమ్రా, అశ్విన్ లు పదునైన బంతులు వేస్తూ ఆసీస్ బౌలర్లను కంగారెత్తిస్తున్నారు.
తొలిటెస్ట్ మ్యాచ్ గెలుపుతో జోరుమీదున్న బాక్సింగ్‌డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూ బ్యాట్స్‌మెన్‌కు అదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 5 ఓవర్‌లోని రెండో బంతికే జోబర్స్‌ను బుమ్రా డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ మాథ్యూ వేడ్‌(30), డేంజరస్ బ్యాట్స్ మెన్ స్మిత్‌ (0)లను రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్ కు పంపించాడు. దీంతో ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. కాగా 37ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్లు 97పరుగులు చేసి 3వికెట్లను కోల్పోయింది.

Tags:    

Similar News