చార్టెడ్ ఫ్లైట్‌లో బంగ్లాదేశ్ వెళ్లనున్న ఆసీస్ ఆటగాళ్లు
దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్‌లో కోవిడ్ 19 కేసులు భారీగా పెరిగిపోతుండటంతో అక్కడ ప్రస్తుతం లాక్‌డౌన్ విధించారు. అయితే పరిస్థితి అలా ఉన్న ఆసీస్ జట్టు పర్యటన రద్దు చేయబోవడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ప్రస్తుతం వెస్టిండీస్‌లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. బార్బొడోస్ నుంచి నేరుగా ఆసీస్ క్రికెటర్లు ఢాకా చేరుకోనున్నారు. కాగా, ఢాకా చేరుకున్న వెంటనే ఆసీస్ క్రికెటర్లు కఠినమైన బయోబబుల్‌లోకి వెళ్తారని సీఏ తెలియజేసింది. ఐదు మ్యాచ్‌ల […]
దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్‌లో కోవిడ్ 19 కేసులు భారీగా పెరిగిపోతుండటంతో అక్కడ ప్రస్తుతం లాక్‌డౌన్ విధించారు. అయితే పరిస్థితి అలా ఉన్న ఆసీస్ జట్టు పర్యటన రద్దు చేయబోవడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ప్రస్తుతం వెస్టిండీస్‌లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. బార్బొడోస్ నుంచి నేరుగా ఆసీస్ క్రికెటర్లు ఢాకా చేరుకోనున్నారు. కాగా, ఢాకా చేరుకున్న వెంటనే ఆసీస్ క్రికెటర్లు కఠినమైన బయోబబుల్‌లోకి వెళ్తారని సీఏ తెలియజేసింది.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొత్తం ఢాకాలోనే జరుగుతుందని.. ఇంతకు ముందు తెలిపినట్లు చిట్టాగాంగ్‌లో మ్యాచ్‌లను నిర్వహించడం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. వెస్టిండీస్‌లో ఆస్ట్రేలియా 1-4తో టీ20 సిరీస్ ఓడిపోయింది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం వల్లే ఓడిపోయినట్లు నిపుణులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ సిరీస్‌కి కూడా వీళ్లు దూరంగానే ఉంటారని కెప్టెన్ ఆరోన్ ఫించ్ తెలిపారు.