యాషెస్ 2021: రెండో టెస్టులో కష్టాల్లో పడ్డ ఇంగ్లాండ్

దిశ, స్పోర్ట్స్: యాషెస్ 2021లో భాగంగా అడిలైడ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు కష్టాల్లో పడింది. డే/నైట్ టెస్టులో తొలి రోజు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 220/2 స్కోర్ సాధించింది. ఇక రెండో రోజు ఓపెనర్ మార్నస్ లబుషేన్ (103) సెంచరీ సాధించాడు. అయితే కెప్టెన్ స్టీవ్ స్మిత్ (93) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి తోడుగా అలెక్స్ క్యారీ (51), మిచెల్ స్టార్క్ (39), మైఖెల్ నెసర్ (35) రాణించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ […]

Update: 2021-12-17 10:58 GMT

దిశ, స్పోర్ట్స్: యాషెస్ 2021లో భాగంగా అడిలైడ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు కష్టాల్లో పడింది. డే/నైట్ టెస్టులో తొలి రోజు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 220/2 స్కోర్ సాధించింది. ఇక రెండో రోజు ఓపెనర్ మార్నస్ లబుషేన్ (103) సెంచరీ సాధించాడు. అయితే కెప్టెన్ స్టీవ్ స్మిత్ (93) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి తోడుగా అలెక్స్ క్యారీ (51), మిచెల్ స్టార్క్ (39), మైఖెల్ నెసర్ (35) రాణించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 473/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. బెన్ స్టోక్స్ 3, జేమ్స్ అండర్సన్ 2 వికెట్లు తీశాడు. ఇక స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, జో రూట్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు కేవలం 8.4 ఓవర్లు మాత్రమే ఆడింది. అయితే రెండు కీలకమైన వికెట్లు కోల్పోయి కేవలం 17 పరుగులు మాత్రమే చేపింది. ఓపెనర్ రోరీ బర్న్స్ (4) మిచెల్ స్టార్క్ ఔట్ చేయగా.. హసీబ్ హమీద్ (6) ను మైఖెల్ నెసర్ పెవిలియన్ చేర్చాడు. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 17/2 వద్ద నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 456 పరుగుల వెనుక ఉన్నది.

Tags:    

Similar News