బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్‌కు మరో అంతరాయం..!
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021ను సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించింది. ఈ షెడ్యూల్‌పై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతే కాకుండా పలు దేశాల క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల కారణంగా దూరమవుతున్నారు. అయితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఐపీఎల్ 2021ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహిస్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా చెప్పారు. తాజాగా ఆస్ట్రేలియా అదే […]
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021ను సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించింది. ఈ షెడ్యూల్‌పై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతే కాకుండా పలు దేశాల క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల కారణంగా దూరమవుతున్నారు. అయితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఐపీఎల్ 2021ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహిస్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా చెప్పారు. తాజాగా ఆస్ట్రేలియా అదే సమయానికి ట్రై నేషన్ సిరీస్ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఆఫ్గానిస్తాన్ దేశాల మధ్య ఈ సిరీస్ ఏర్పాటు చేయడానికి క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధపడుతున్నది. కాగా, ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పాటు ఆఫ్గనిస్తాన్, వెస్టిండీస్ ఆటగాళ్లు కూడా ఆడుతున్నారు. పలు ఫ్రాంచైజీలలో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయంతో ఐపీఎల్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగలనున్నది. అయితే ఈ సిరీస్‌కు ఐసీసీ అనుమతి రావల్సి ఉండటంతో దీనికి సంబంధించిన వివరాలను క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా వెలువరించలేదు.