వేస్ట్ బాటిల్ నమూనా అదుర్స్…

దిశ, సిటీబ్యూరో: నిత్యం వేలాది మంది వాహానదారులు, పర్యాటకులు, పాదచారులతో బిజీ బిజీగా ఉండే రహదారి నెక్లెస్ రోడ్డు. ఇప్పటికే ఇక్కడ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన లవ్ హైదరాబాద్ అందర్నీ ఆకట్టుకొంటుండగా, ఇపుడు దీనికి మరొకటి తోడైంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను ఉపయోగించిన తరువాత ఎక్కడబడితే అక్కడ పారవేయకుండా ఉండాలన్న విషయాన్ని సింబాలిక్ గా చెప్పేందుకు, ఈ రోడ్ లో ఐరన్ తో చేసిన పెద్ద సైజు వాటర్ బాటిల్ […]

Update: 2021-07-02 07:49 GMT

దిశ, సిటీబ్యూరో: నిత్యం వేలాది మంది వాహానదారులు, పర్యాటకులు, పాదచారులతో బిజీ బిజీగా ఉండే రహదారి నెక్లెస్ రోడ్డు. ఇప్పటికే ఇక్కడ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన లవ్ హైదరాబాద్ అందర్నీ ఆకట్టుకొంటుండగా, ఇపుడు దీనికి మరొకటి తోడైంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను ఉపయోగించిన తరువాత ఎక్కడబడితే అక్కడ పారవేయకుండా ఉండాలన్న విషయాన్ని సింబాలిక్ గా చెప్పేందుకు, ఈ రోడ్ లో ఐరన్ తో చేసిన పెద్ద సైజు వాటర్ బాటిల్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. పర్యాటకులు తాము ఖాళీ చేసిన వాటర్ బాటిళ్లు వేసేందుకు బాటిల్ ఆకృతితో దీన్ని జీహెచ్ఎంసీ డిజైన్ చేసి పెట్టించింది.

బాటిళ్లు నిర్దేశిత ప్రాంతంలో మాత్రమే వేసేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేయించినట్లు బల్దియా అదికారులు వెల్లడించారు. నెక్లెస్ రోడ్డు లో పారిశుద్ద్య పనులు మెరుగు పడాలని, ఎక్కడబడితే అక్కడ వ్యర్థాలు పడకుండా చర్యలు తీసుకోవాలన్న మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ నమూనాను చేయించినట్లు అధికారులు తెలిపారు. ఖాళీ బాటిళ్లు ఇందులో వేయాలన్నమాట అని మదిలో తోచేలా ఈ నమూనాను ఒకవైపు వంగి ఉండేలా ఏర్పాటు చేశారు. చూసేందుకు ఎంతో వినూత్నంగా ఉన్న ఈ బాటిల్ నమూనాను పర్యాటకులు, పాదచారులు, వాహనదారులు సైతం ఆగి మరీ చూసి, చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇక చిన్న పిల్లల ఎంజాయ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Tags:    

Similar News