ఇకపై గాంధీలో అటెండెంట్లకు నో ఎంట్రీ..
దిశ, తెలంగాణ బ్యూరో : గాంధీ ఆస్పత్రిలోకి నేటి నుంచి పేషెంట్ల అటెండెంట్లను అనుమతించబోమని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు ప్రకటించారు. కరోనా పేషెంట్ల బంధువులు, కుటుంబ సభ్యులు తమ వారికి సేవలు చేసేందుకు కరోనా వార్డుల్లోకి వచ్చి వారు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. రోగితో పాటు వచ్చిన వారు కూడా కరోనాకు బలై చనిపోతున్నారు. వీటితో పాటు కోవిడ్ వార్డుల్లో సంచరించిన అటెండెంట్లు బహిరంగ ప్రదేశాలకు వెళ్లి ఇతరులకు వ్యాధి సోకేందుకు కారణమవుతున్నారు. ఇలాంటి […]
దిశ, తెలంగాణ బ్యూరో : గాంధీ ఆస్పత్రిలోకి నేటి నుంచి పేషెంట్ల అటెండెంట్లను అనుమతించబోమని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు ప్రకటించారు. కరోనా పేషెంట్ల బంధువులు, కుటుంబ సభ్యులు తమ వారికి సేవలు చేసేందుకు కరోనా వార్డుల్లోకి వచ్చి వారు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. రోగితో పాటు వచ్చిన వారు కూడా కరోనాకు బలై చనిపోతున్నారు. వీటితో పాటు కోవిడ్ వార్డుల్లో సంచరించిన అటెండెంట్లు బహిరంగ ప్రదేశాలకు వెళ్లి ఇతరులకు వ్యాధి సోకేందుకు కారణమవుతున్నారు. ఇలాంటి దుష్పరిణామాలు జరగకుండా ప్రజలను వ్యాధి నుంచి కాపాడేందుకు గాంధీ ఆసుపత్రి వైద్యులు ఈ మేరకు నిబంధనలు విధించారు.
గురువారం మీడియాతో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు మాట్లాడుతూ.. అటెండెంట్లను ఆసుపత్రి లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పేషెంట్ల వివరాలన ప్రతీ రోజు అవసరమైనప్పుడల్లా ఫోన్ ద్వారా సమాచారం అందిస్తామన్నారు. పేషెంట్లకు కావల్సిన చికిత్సలను, ఆహారాలను, ఇతర సదుపాయాలను అన్నింటిని ఆసుపత్రి సిబ్బంది మాత్రమే పర్యవేక్షిస్తారని తెలిపారు. అనవసరంగా కరోనా వార్డుల్లోకి వచ్చి వ్యాధి భారిన పడుకూడదని సూచించారు. గాంధీ ఆసుపత్రిలో విధించిన నిబంధనలను తప్పని సరిగా పాటించాలని పేషెంట్ల అటెండెంట్లను కోరారు.