కేటీఆర్ పర్యటనలో ముస్లిం మహిళ ఆత్మహత్యాయత్నం (వీడియో)

దిశ, సిరిసిల్ల: మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో విషయం తెలిసిన ఓ ముస్లిం మహిళ టీఆర్ఎస్ నాయకుడు తనపై దాడిచేసి, తిరిగి తనపైనే దొంగతనం కేసు పెట్టారంటూ మంత్రికి చెప్పుకోవడానికి వచ్చింది. మంత్రి కేటీఆర్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వెళ్ళిపోగానే కుప్పకూలి పడిపోయింది. తనకు అవమానం జరిగి పోలీస్ స్టేషన్‌కి వెళ్తే తన పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ అందుకే ఆత్మహత్యాయత్నం చేసానని తెలిపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన […]

Update: 2021-11-06 11:29 GMT

దిశ, సిరిసిల్ల: మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో విషయం తెలిసిన ఓ ముస్లిం మహిళ టీఆర్ఎస్ నాయకుడు తనపై దాడిచేసి, తిరిగి తనపైనే దొంగతనం కేసు పెట్టారంటూ మంత్రికి చెప్పుకోవడానికి వచ్చింది. మంత్రి కేటీఆర్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వెళ్ళిపోగానే కుప్పకూలి పడిపోయింది. తనకు అవమానం జరిగి పోలీస్ స్టేషన్‌కి వెళ్తే తన పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ అందుకే ఆత్మహత్యాయత్నం చేసానని తెలిపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు మహిళను హుటాహుటిన సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

పట్టణంలో తాను పనిచేసే ఇంటి యజమాని సోదరుడు చనిపోతే వాళ్ళ ఇంట్లోకి పనికి తనను పంపారని, అక్కడ చిన్న మాట దొర్లినందుకు ఇంటి యజమాని కొడుకు, టీఆర్ఎస్ నాయకుడు సోహెల్ తనపై దాడిచేసి చెప్పుతో కొట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్‌కు అతనిపై ఫిర్యాదు చేశానని, హైదరాబాద్‌లోని HRC ని సైతం సంప్రదించానని తెలిపింది. సోహెల్ అన్న 32వ వార్డ్ కౌన్సిలర్ భర్త అక్రం, మరో టీఆర్ఎస్ నాయకుడు కలిసి తాను దొంగతనం చేశానని తప్పుడు ఆరోపణ చేశారని వాపోయింది. దీంతో అవమానం భరించలేక హెయిర్ డై తాగినట్లు షేక్ హసీనా తెలిపింది.

Tags:    

Similar News