నిజామాబాద్‌లో రక్తచరిత్ర.. ప్రత్యర్థుల దాడిలో బీహారి గౌస్ హతం

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. ఇరు వర్గాలు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్న ఘటనలో పేరు మోసిన రౌడీషీటర్ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం నగరంలోని 6వ టౌన్ పోలిస్ స్టేషన్ పరిధి ధర్మపూరి హిల్స్‌లో సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ నగరానికి చెందిన బీహారి గౌస్ అలియాస్ అయూబ్ పాత నేరస్థుడు. స్థానికంగా కత్తులు […]

Update: 2021-05-23 09:52 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. ఇరు వర్గాలు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్న ఘటనలో పేరు మోసిన రౌడీషీటర్ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం నగరంలోని 6వ టౌన్ పోలిస్ స్టేషన్ పరిధి ధర్మపూరి హిల్స్‌లో సంచలనంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..

నిజామాబాద్ నగరానికి చెందిన బీహారి గౌస్ అలియాస్ అయూబ్ పాత నేరస్థుడు. స్థానికంగా కత్తులు తల్వార్‌లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేసేవాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం నరగంలోని బాబాన్ సాహబ్ పహడ్ ప్రాంతంలో ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి డబ్బులు లాక్కున్నాడు. అదే విధంగా ధర్మపూరి హిల్స్ ప్రాంతంలో మరో యువకుడిపై కత్తితో దాడి చేసి డబ్బులు గుంజుకున్నాడు. ఈ విషయం తెలిసిన ముజాహిద్‌నగర్‌కు చెందిన ఉస్మాన్ మరికొందరు యువకులు.. ధర్మపూరి హిల్స్‌‌లో ఉన్న బీహారి గౌస్‎ను ప్రశ్నించారు. వారి మందలింపుతో ఒక్కసారిగా గౌస్ కత్తితో ఉస్మాన్‌పై దాడి చేశాడు. ముఖంపై మూడు కత్తిపోట్లు దించాడు. ఇదే క్రమంలో ఉస్మాన్‌కు తోడుగా వచ్చిన ముగ్గురు యువకులు ఒక్కసారిగా బీహారి గౌస్‌పై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే ఘర్షణలో ఉస్మాన్‌కు కూడా తీవ్రగాయాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

జంట హత్య కేసులో నిందితుడిగా బీహారి గౌస్

బోధన్‌కు చెందిన బీహారి గౌస్ అలియస్ అయూబ్ పాత నేరస్థుడు. 2009 లో జరిగిన బాబారెడ్డి, నాహేద్ బిన్ చావుస్‌ల జంట హత్య కేసులో పోలీసులు రౌడీ షీట్ నమోదు చేశారు. ఇదే కేసులో 2009లోనే బీహారి గౌస్ పై కోర్టు ఆవరణలోనే హత్యాయత్నం జరగగా.. ప్రధాన నిందితుడైన షేక్ అక్రంను ప్రత్యర్థులు దారుణంగా పొడిచి చంపారు. నాడు ప్రత్యర్థుల హత్యాయత్నం నుంచి తప్పించుకున్న బీహారి గౌస్ ఆదివారం జరిగిన కత్తిదాడిలో హతమయ్యాడు. బీహారి గౌస్ ఇటీవల కాలంలో బలవంతపు వసూళ్లకు తెగబడటం, భౌతిక దాడులు చేయడం, కత్తులు చూపి చంపుతానని బెదిరించడంతోనే హతమయ్యాడని జనాలు చర్చించుకుంటున్నారు. దశాబ్దకాలంగా మైనార్టి ఎరియాలో గౌస్ పేరు చెబితే కార్పొరేటర్లు, లీడర్లు కుడా మామూళ్లు ఇచ్చేవారని స్థానికులు చెబుతారు.

Tags:    

Similar News