షాకింగ్.. ఎంపీటీసీపై ఇనుప రాడ్‌తో దాడి.. పరిస్థితి విషమం
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రాణంపల్లి ఎంపీటీసీపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో ఎంపీటీసీ తీవ్రంగా గాయపడగా.. ఆయనను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. మొరం దందా నిర్వహించే ముజ్జుకు రానాంపల్లికి, ఎంపీటీసీ గౌస్ కుటుంబాల మధ్య ఎన్నికల నాటి నుంచే గొడవలు జరుగుతున్నాయి. అయితే, శనివారం బోధన్ తహసీల్దార్ […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రాణంపల్లి ఎంపీటీసీపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో ఎంపీటీసీ తీవ్రంగా గాయపడగా.. ఆయనను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. మొరం దందా నిర్వహించే ముజ్జుకు రానాంపల్లికి, ఎంపీటీసీ గౌస్ కుటుంబాల మధ్య ఎన్నికల నాటి నుంచే గొడవలు జరుగుతున్నాయి.
అయితే, శనివారం బోధన్ తహసీల్దార్ గఫ్ఫార్.. ముజ్జుకు సంబంధించిన ట్రాక్టర్‌ను పట్టుకొని సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో తన ట్రాక్టర్‌ను సీజ్ చేయడానికి ఎంపీటీసీ గౌసే కారణం అని ముజ్జు అతడితో వాగ్వాదానికి దిగాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ కూర్చున ఎంపీటీసీ గౌస్‌పై ఇనుప రాడుతో మరో వర్గం దాడి చేసింది.
ఈ దాడిలో గౌస్ తల పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. కుటుంబ సభ్యులు గౌస్‌ను చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించగా పరిస్థితి విషమంగా ఉందని నిజామాబాద్ ఆసుపత్రికి తరిలించారు. ఈ మేరకు బాధితులు రుద్రూర్ పోలీస్ స్టేషన్‌లో దాడి ఘటనపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.