వారిపై కాదు.. దమ్ముంటే నా పైన దాడులు చేయండి: డీకే అరుణ

దిశ, ప్రతినిధి, మహబూబ్ నగర్/ గద్వాల: దమ్ముంటే.. నా పైన.. మా కూతురు పైన.. నా భర్త పైన దాడులు చేయండి. అంతేకానీ మీ అరాచకాలను నిలదీసిన పేదోళ్లపై దాడులు చేస్తే సహించేది లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 2012 లో డీకే అరుణ మంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల స్థానం లో అధికార పార్టీ నేతలు ఇటీవల నర్సింగ్ కళాశాల, జిల్లా […]

Update: 2021-12-25 07:14 GMT

దిశ, ప్రతినిధి, మహబూబ్ నగర్/ గద్వాల: దమ్ముంటే.. నా పైన.. మా కూతురు పైన.. నా భర్త పైన దాడులు చేయండి. అంతేకానీ మీ అరాచకాలను నిలదీసిన పేదోళ్లపై దాడులు చేస్తే సహించేది లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 2012 లో డీకే అరుణ మంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల స్థానం లో అధికార పార్టీ నేతలు ఇటీవల నర్సింగ్ కళాశాల, జిల్లా ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన రిలే నిరాహార దీక్షల కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. మీ అరాచకాలు, దోపిడీలను ప్రజలు గ్రహిస్తున్నారు.. మరో రెండు సంవత్సరాలు మీ పాలన ఉంటుందని వాళ్ళ బాధలను బయటకు చెప్పుకోలేక మదనపడి పోతున్నారని అరుణ అన్నారు. పేదల కోసం ఇళ్ల పట్టాలు ఇస్తే వాటిని రద్దు చేయాలనే ఉద్దేశంతో, రాజకీయ కక్షతోనే ఆ స్థలంలో జిల్లా ఆసుపత్రి, నర్సింగ్ కళాశాలలు నిర్మించేందుకు శంకుస్థాపనలు చేశారన్నారు. పేదలు కడుపు మంటతో ఆందోళనలు చేస్తే వారిపై దాడులు చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News