గాంధీ ఆసుపత్రిలో దారుణం.. అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొని రెండ్రోజులైనా గడువకముందే హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణ ఘటన చోటుచేసుకుంది. చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి వచ్చిన అక్కాచెల్లెళ్లపై ఆసుపత్రిలో సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మూత్రపిండాల సమస్యతో ఈనెల 5వ తేదీన గాంధీ ఆసుపత్రిలో చేరాడు. ఆయన వెంట భార్య, మరదలు సహాయకులుగా ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో రేడియోగ్రాఫర్‌గా పనిచేసే ఉమామహేశ్వర్ అనే వ్యక్తి రోగితో ఆసుపత్రికి […]

Update: 2021-08-17 00:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొని రెండ్రోజులైనా గడువకముందే హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణ ఘటన చోటుచేసుకుంది. చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి వచ్చిన అక్కాచెల్లెళ్లపై ఆసుపత్రిలో సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మూత్రపిండాల సమస్యతో ఈనెల 5వ తేదీన గాంధీ ఆసుపత్రిలో చేరాడు. ఆయన వెంట భార్య, మరదలు సహాయకులుగా ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో రేడియోగ్రాఫర్‌గా పనిచేసే ఉమామహేశ్వర్ అనే వ్యక్తి రోగితో ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు మహిళలకు దూరపు బంధువు. దీంతో వారు రోజూ అతన్ని కలిసి మాట్లాడేవారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఆ అక్కాచెల్లెళ్లిద్దరూ కనిపించకుండా పోయారు.

దీంతో వారు రోజూ ఉమామహేశ్వర్‌తో మాట్లాడటం గమనించిన రోగి కుమారుడు, ఉమామహేశ్వర్‌ను నిలదీయగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 8వ తేదీన ఉమామహేశ్వర్ ఇద్దరు మహిళలను ఒక గదిలోకి తీసుకెళ్లి కల్లులో మత్తుమందు కలిపి ఇచ్చాడు. కల్లు తాగిన ఇద్దరు మహిళలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో ఇదే అదునుగా భావించిన ఉమామహేశ్వర్, అతని స్నేహితులతో కలిసి వారిపై సామూహికంగా అత్యచారం చేశారు. ఎవరికైనా చెప్తే చంపుతామని బెదిరించాడు. అనంతరం ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేశ్వర్‌తో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News