మొబైల్ కూరగాయల వాహనాల్లో ఏటీఎం‌ సేవలు

దిశ, వరంగల్: వరంగల్ నగరంలోని కంటైన్‌మెంట్‌ ప్రాంతాలకు కూరగాయలు డెలివరీ చేసేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాన్‌లల్లో ఏటీఎం సౌకర్యం అందుబాటులోకి‌ తెచ్చినట్లు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతి తెలిపారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో ఆమె సమావేశం నిర్వహించారు. మొబైల్ వ్యాన్‌ల ద్వారా ఇంటింటికి కూరగాయలు పంపిణీ కోసం అధికారులు ఏర్పాటు చేసిన బృందాల నాయకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లీడ్ బ్యాంక్ […]

Update: 2020-04-16 11:04 GMT

దిశ, వరంగల్: వరంగల్ నగరంలోని కంటైన్‌మెంట్‌ ప్రాంతాలకు కూరగాయలు డెలివరీ చేసేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాన్‌లల్లో ఏటీఎం సౌకర్యం అందుబాటులోకి‌ తెచ్చినట్లు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతి తెలిపారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో ఆమె సమావేశం నిర్వహించారు. మొబైల్ వ్యాన్‌ల ద్వారా ఇంటింటికి కూరగాయలు పంపిణీ కోసం అధికారులు ఏర్పాటు చేసిన బృందాల నాయకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లీడ్ బ్యాంక్ ద్వారా మొబైల్ ఏటీఎంను అనుసంధానం చేసి ఇంటి వద్దనే ఏటీఎం కార్డ్‌తో డబ్బులు డ్రా చేసుకునేందుకు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

Tags: GWMC Commissioner, ATM services, mobile vegetable vehicles, warangal

Tags:    

Similar News