ట్రైన్ సేవలు వద్దే వద్దు : పీఎంతో నలుగురు సీఎంలు
న్యూఢిల్లీ: దశలవారీగా ట్రైన్ సేవలను పునరుద్ధరించే వ్యూహంలో భాగంగా ఇండియన్ రైల్వేస్ మంగళవారం 15 జతల ట్రైన్‌లను పట్టాలెక్కించనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయాన్ని నాలుగు రాష్ట్రాల సీఎంలు వ్యతిరేకించారు. ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ సహా తమిళనాడు సీఎం పళనిస్వామి, ఏపీ సీఎం జగన్, ఛత్తీస్‌గడ్ సీఎం భుపేష్ భాగెల్‌లు.. తమ రాష్ట్రాల్లో ట్రైన్ సేవలు వద్దే వద్దే అని తెగేసి చెప్పారు. ట్రైన్, విమాన సేవలను […]
న్యూఢిల్లీ: దశలవారీగా ట్రైన్ సేవలను పునరుద్ధరించే వ్యూహంలో భాగంగా ఇండియన్ రైల్వేస్ మంగళవారం 15 జతల ట్రైన్‌లను పట్టాలెక్కించనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయాన్ని నాలుగు రాష్ట్రాల సీఎంలు వ్యతిరేకించారు. ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ సహా తమిళనాడు సీఎం పళనిస్వామి, ఏపీ సీఎం జగన్, ఛత్తీస్‌గడ్ సీఎం భుపేష్ భాగెల్‌లు.. తమ రాష్ట్రాల్లో ట్రైన్ సేవలు వద్దే వద్దే అని తెగేసి చెప్పారు. ట్రైన్, విమాన సేవలను మే 31 వరకు ఎట్టిపరిస్థితుల్లో పునరుద్ధరించవద్దని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రధానిని కోరారు. అనంతరం సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, ఛత్తీస్‌గడ్ సీఎం భూపేష్ కూడా ట్రైన్ సేవలను పునరుద్ధరించే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తమ రాష్ట్రాల్లో ట్రైన్ సేవలు ప్రారంభమైతే.. కొవిడ్ 19 అనుమానితులను గుర్తించడం, ఐసొలేషన్‌లోకి పంపించడం, టెస్టులు నిర్వహించడం కష్టతరమవుతుందని ఈ ముఖ్యమంత్రులు ప్రధానికి విన్నవించారు.