పూచీకత్తు లేకుండా రూ.10వేల రుణం..

దిశ, మహబూబ్ నగర్ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వలన ఆర్థికంగా నష్టపోయిన వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ ప్యాకేజీ ప్రకటించిన విషయం విదితమే. అయితే, ఈ ప్యాకేజీ కింద వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నదని మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్ర శేఖర్ ఓ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎటువంటి పూచీకత్తు లేకుండా […]

Update: 2020-07-12 06:57 GMT

దిశ, మహబూబ్ నగర్ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వలన ఆర్థికంగా నష్టపోయిన వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ ప్యాకేజీ ప్రకటించిన విషయం విదితమే. అయితే, ఈ ప్యాకేజీ కింద వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నదని మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్ర శేఖర్ ఓ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నదని వివరించారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రాయితీ రుణాలను అందిస్తున్నదని.. కావున, రైతులు, వ్యాపారాలు ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Tags:    

Similar News