మరికొన్ని గంటల్లో అవార్డు.. కోచ్ మృతి

దిశ, స్పోర్ట్స్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ద్రోణాచార్య (జీవన సాఫల్య పురస్కారం) అవార్డు అందుకోవడానికి కొన్ని గంటల ముందు అథ్లెటిక్స్ కోచ్ పురుషోత్తమ్ రాయ్ (79) గుండె పోటుతో మరణించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించింది. ఈ ఏడాది కొవిడ్-19 కారణంగా అవార్డులను నేరుగా కాకుండా ఆన్‌లైన్ సమావేశం ద్వారా అందిస్తున్నారు. కాగా, శనివారం జరిగే వర్చువల్ అవార్డు ప్రదానోత్సవంలో స్వీకరించాల్సి ఉంది. ఇందుకోసం ఆయన శుక్రవారం బెంగళూరులో […]

Update: 2020-08-28 12:27 GMT

దిశ, స్పోర్ట్స్ :

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ద్రోణాచార్య (జీవన సాఫల్య పురస్కారం) అవార్డు అందుకోవడానికి కొన్ని గంటల ముందు అథ్లెటిక్స్ కోచ్ పురుషోత్తమ్ రాయ్ (79) గుండె పోటుతో మరణించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించింది. ఈ ఏడాది కొవిడ్-19 కారణంగా అవార్డులను నేరుగా కాకుండా ఆన్‌లైన్ సమావేశం ద్వారా అందిస్తున్నారు.

కాగా, శనివారం జరిగే వర్చువల్ అవార్డు ప్రదానోత్సవంలో స్వీకరించాల్సి ఉంది. ఇందుకోసం ఆయన శుక్రవారం బెంగళూరులో జరిగిన రిహార్సల్స్‌లో కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న కొద్ది సేపటికే ఆయన గుండె పోటుతో మృతి చెందినట్లు ఏఎన్ఐ న్యూస్ పేర్కొంది. జాతీయ అథ్లెటిక్స్ కోచ్‌గా శాయ్ తరపున పని చేసిన ఆయన ఎంతో మంది అథ్లెట్లను తీర్చిదిద్దారు. అవార్డు అందుకోవడానికి కొన్ని గంటల ముందే ఆయన చనిపోవడంతో క్రీడాలోకం విషాదంలో మునిగిపోయింది.

Tags:    

Similar News