చంద్రుడిపై ఆస్ట్రోనాట్స్ వదిలిన జ్ఞాపకాలు

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాకు చెందిన ఆస్ట్రోనాట్స్.. ‘డో హార్లే , జాబ్ బెంకెన్‌’ వీరిద్దరూ ఇటీవలే అంతరిక్ష నౌక ‘క్రూ డ్రాగన్’ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్లకు కొడుకులున్నారు. వారికి డైనోసార్ బొమ్మలంటే చాలా ఇష్టమట. కాగా, బెంకెన్ కుమారుడు ఓ డైనోసార్ బొమ్మను తండ్రికి ఇవ్వగా.. అతడు దాన్ని స్పేస్‌లో వదిలేశాడు. ఈ విషయం గురించి బెంకెన్ మాట్లాడుతూ.. ‘నా కుమారుడు ఇచ్చిన ఈ టాయ్.. […]

Update: 2020-06-14 02:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

అమెరికాకు చెందిన ఆస్ట్రోనాట్స్.. ‘డో హార్లే , జాబ్ బెంకెన్‌’ వీరిద్దరూ ఇటీవలే అంతరిక్ష నౌక ‘క్రూ డ్రాగన్’ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్లకు కొడుకులున్నారు. వారికి డైనోసార్ బొమ్మలంటే చాలా ఇష్టమట. కాగా, బెంకెన్ కుమారుడు ఓ డైనోసార్ బొమ్మను తండ్రికి ఇవ్వగా.. అతడు దాన్ని స్పేస్‌లో వదిలేశాడు. ఈ విషయం గురించి బెంకెన్ మాట్లాడుతూ.. ‘నా కుమారుడు ఇచ్చిన ఈ టాయ్.. స్పేస్‌లో తేలియాడుతుండటం చూసి బాగా ఎంజాయ్ చేసి ఉంటాడు’ అని తెలిపారు. అయితే అంతరిక్ష ప్రయాణాల్లో టాయ్స్‌ను తీసుకెళ్లడం పరిపాటే. గతంలో చంద్రునిపై అడుగుపెట్టిన కొందరు అక్కడ కొన్ని వస్తువులను తమ గుర్తుగా వదిలి వచ్చిన రోజులున్నాయి. అవేంటంటే..?

1969, జులై 20న ‘అపోలో 11’ చంద్రునిపై అడుగిడింది. అందులో ప్రయాణించిన ఆస్ట్రోనాట్ క్రిస్టియన్ బజ్ ఆల్డ్రిన్.. తన వెంట తీసుకెళ్లిన మీనియేచర్ చాలైస్ (డెకోరేటివ్ సిల్వర్ లేదా గోల్డ్ కప్), వైన్, బ్రెడ్‌లను తన గుర్తుగా అక్కడే వదిలేసి వచ్చాడు.

ఫ్యామిలీ ఫోటో

1972లో అపోలో 16 మూన్ సర్ఫేస్‌పై ల్యాండ్ అయ్యింది. ఆస్ట్రోనాట్ చార్లెస్ డ్యూక్ తన ఫ్యామిలీ ఫోటోను, తన చేత్తో రాసిన ఓ లేఖను అక్కడ వదిలేసి వచ్చాడు. కానీ అక్కడ అది ఎన్ని రోజులు ఉన్నదో తెలియదు. ఎందుకంటే.. సోలార్ రేడియేషన్ వల్ల ఆ ఫోటో గుర్తులు చెరిగిపోవచ్చు.

గోల్ఫ్ క్లబ్ అండ్ బాల్స్

చంద్రునిపై గోల్ఫ్ ఆడిన తొలి వ్యక్తిగా ‘గోల్ఫర్ అలన్ షెపర్డ్’ చరిత్రలో నిలిచిపోయాడు. చందమామ తోడుగా షెపర్డ్ ఆడిన గోల్ఫ్ షాట్లు ఇప్పటికి కూడా ఎవరూ మరిచిపోలేరు. ‘మైల్స్ అండ్ మైల్స్ అండ్ మైల్స్’ అంటూ తన షాట్ గురించి వర్ణించాడు షెపర్డ్. తను ఆడిన సెకండ్ షాట్ లూనార్ సర్ఫేస్‌ను దాటుకుని అలా గాల్లోకి ఎగిరిపోయిందట.

106 ఆబ్జెక్ట్స్

1969లో అపోలో 11 చందమామ చెంతకు చేరింది. ఆ సమయంలో అక్కడ 106 ఆబ్జెక్ట్స్‌తో పాటు 74 దేశాలకు చెందిన వరల్డ్ లీడర్స్ వాయిస్ రికార్డులతో కూడిన సిలికాన్ డిస్క్‌ను అక్కడ వదిలి వచ్చారు. ఆ ప్రపంచ నాయకులలో లిస్టులో ఇందిరా గాంధీ వాయిస్ కూడా ఉంది.

గోల్డెన్ ఆలివ్ బ్రాంచ్

అపోలో 11.. గోల్డెన్ ఆలివ్ కొమ్మను చంద్రుని ఉపరితలంపై వదలి వచ్చింది. అంతేకాదు ఆస్ట్రోనాట్స్‌ మల మూత్రాలను కూడా అక్కడ వదిలి వేశారని స్పేస్. కామ్ వెల్లడించింది.

Tags:    

Similar News