ఏబీవీపీ అసెంబ్లీ ముట్టడి.. ఉద్రిక్తత
విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియింబర్స్‌మెంట్లు, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అసెంబ్లీ ఎదట ధర్నా చేశారు. పోలీసులు ఆందోళన కారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు నిరసన కారులపై లాఠీచార్జీ చేశారు. దీంతో అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు […]
విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియింబర్స్‌మెంట్లు, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అసెంబ్లీ ఎదట ధర్నా చేశారు. పోలీసులు ఆందోళన కారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు నిరసన కారులపై లాఠీచార్జీ చేశారు. దీంతో అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. కేజీ టూ పీజీ ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. కఠినమైన ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేశారు. గత హామీలకనుగుణంగా రాష్ర్టంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు.
tags : Assembly, ABVP, student protest, Lotty Charge, police