వర్షాల నేపథ్యంలో అసెంబ్లీ రెండ్రోజులు వాయిదా?

దిశ, తెలంగాణ బ్యూరో: గులాబ్ తూఫాన్ ప్రభావంతో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ, మండలి సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులంతా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు కురుస్తుండటంతో అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ.. వీరు కూడా స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం వరకు సభ నిర్వహించిన అనంతరం స్పీకర్ అధ్యక్షతన అఖిల […]

Update: 2021-09-27 21:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గులాబ్ తూఫాన్ ప్రభావంతో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ, మండలి సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులంతా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు కురుస్తుండటంతో అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ.. వీరు కూడా స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.

దీంతో మంగళవారం మధ్యాహ్నం వరకు సభ నిర్వహించిన అనంతరం స్పీకర్ అధ్యక్షతన అఖిల పక్షంతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రెండ్రోజుల పాటు సభను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో మండలి, శాసనసభ్యులు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించనున్నారు. నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..