అసోంలో టెర్రర్ అటాక్.. ఐదుగురు సజీవ దహనం
దిశ, వెబ్‌డెస్క్: అసోంలోని డిమా హాసాఓ జిల్లా డియుంగ్ ముఖ్‌లో ఏడు బొగ్గు ట్రక్కులకు కొందరు దుండగులు నిప్పంటించారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు. ట్రక్కులన్నీ కాలి బూడిదయ్యాయి. డీఎన్‌ఎల్‌ఏ ఉగ్రసంస్థ ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రేంజర్బిల్ ప్రాంతంలో ఆగంతుకులు తొలుత ట్రక్కులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అనంతరం వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన ఐదుగురు ట్రక్కు […]
దిశ, వెబ్‌డెస్క్: అసోంలోని డిమా హాసాఓ జిల్లా డియుంగ్ ముఖ్‌లో ఏడు బొగ్గు ట్రక్కులకు కొందరు దుండగులు నిప్పంటించారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు. ట్రక్కులన్నీ కాలి బూడిదయ్యాయి. డీఎన్‌ఎల్‌ఏ ఉగ్రసంస్థ ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రేంజర్బిల్ ప్రాంతంలో ఆగంతుకులు తొలుత ట్రక్కులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అనంతరం వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన ఐదుగురు ట్రక్కు డ్రైవర్లయినట్లు గుర్తించారు. ట్రక్కులలో మొత్తం 10 మంది ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అసోంలో డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) ఉగ్ర సంస్థ మళ్లీ క్రియాశీలకంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవం మైబాంగ్‌లో కాల్పులకు తెగబడింది. కొంతమంది గ్రామస్థులు భద్రతా దళాలకు తమ గురించి సమాచారం అందిస్తున్నందు వల్లే కాల్పులు జరిపినట్లు తెలిపింది. ఆ తర్వాత ఆగస్టు 18, 19 తేదీల్లో మైబాంగ్ దావ్తుహజ రైల్వే స్టేషన్‌లోనూ కాల్పులు జరిపింది.