కరోనా ఎఫెక్ట్.. మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అసోం ప్రభుత్వం కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రంలో అన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు మధ్యాహ్నం 2 గంటల వరకే మూసివేయాలి. బహిరంగ సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. పెళ్లిళ్లు, తదితర శుభకార్యాల్లో గరిష్టంగా 20 మంది మాత్రమే అనుమతినిచ్చారు. ఈ నిబంధనలు రేపటి నుంచి అములోకి వస్తాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అసోం ప్రభుత్వం కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రంలో అన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు మధ్యాహ్నం 2 గంటల వరకే మూసివేయాలి. బహిరంగ సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. పెళ్లిళ్లు, తదితర శుభకార్యాల్లో గరిష్టంగా 20 మంది మాత్రమే అనుమతినిచ్చారు. ఈ నిబంధనలు రేపటి నుంచి అములోకి వస్తాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి.. కొవిడ్ నిబంధనలు పాటించాలని హెచ్చరించారు.