ఆ పరీక్ష సమాధానాలన్నీ.. గోర్లపైనే!

దిశ, వెబ్‌డెస్క్: పరీక్షల్లో కాపీ కొట్టడమనేది కామన్‌గా జరిగేదే. సాధారణంగా స్టూడెంట్స్ కాపీ కొడితే టీచర్స్ పట్టుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం కాబోయే టీచర్సే కాపీ కొడుతూ బుక్ అయిపోవడం ఒకింత ఆసక్తికరం. మెక్సికోలోని మిచోవ్కాన్ ‌ప్రాంతంలో ఇటీవల టీచర్ల కోసం ‘ఎంట్రన్స్ ఎగ్జామ్’ నిర్వహించగా.. వారు కాపీ కొడుతూ అడ్డంగా దొరికిపోయారు. టీచర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం.. మొత్తంగా 350 మంది పరీక్షలు రాశారు. వీరిలో 50 మందికి నూటికి నూరు మార్కులు రాగా, మిగతా […]

Update: 2020-08-31 08:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: పరీక్షల్లో కాపీ కొట్టడమనేది కామన్‌గా జరిగేదే. సాధారణంగా స్టూడెంట్స్ కాపీ కొడితే టీచర్స్ పట్టుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం కాబోయే టీచర్సే కాపీ కొడుతూ బుక్ అయిపోవడం ఒకింత ఆసక్తికరం. మెక్సికోలోని మిచోవ్కాన్ ‌ప్రాంతంలో ఇటీవల టీచర్ల కోసం ‘ఎంట్రన్స్ ఎగ్జామ్’ నిర్వహించగా.. వారు కాపీ కొడుతూ అడ్డంగా దొరికిపోయారు.

టీచర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం.. మొత్తంగా 350 మంది పరీక్షలు రాశారు. వీరిలో 50 మందికి నూటికి నూరు మార్కులు రాగా, మిగతా 300 మందికి 90 నుంచి 99 మార్కులు వచ్చాయి. అయితే, ఈ పరీక్ష జరిపిన ఇతర మున్సిపాలిటీల్లో అత్యధికంగా 71 మార్కులే రావడం గమనార్హం. దీంతో పరీక్షా నిర్వాహకులకు అనుమానమొచ్చి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను క్యాన్సిల్ చేశారు. మళ్లీ పరీక్ష నిర్వహించగా.. వాళ్లు మళ్లీ అవే ఆన్సర్లతో కాపీ కొట్టాలని ప్రయత్నించి అధికారులకు దొరికిపోయారు. మొదట పెట్టిన ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో.. దానికి సంబంధించిన ఆన్సర్లను ఓఎంఆర్‌లో ఫిల్ చేసే క్రమాన్ని ఎవరికీ అనుమానం రాకుండా గోర్లపై డాట్స్ రూపంలో డిజైన్‌గా వేశారు. ప్రతి నెయిల్ మీద పది చుక్కలు వచ్చేలా.. పది గోర్లకు వంద ఆన్సర్లను ఓ ఆర్డర్ ప్రకారం వేసుకున్నారు. ఒక్కో గోరుకు ఒక్కో కలర్‌ను ఎంచుకున్నారు. అయితే రెండోసారి పెట్టిన పరీక్షలో దొరకకుండా ఉండేందుకు, గోర్లు కవర్ అయ్యేలా తమ చేతులకు గ్లోవ్స్ తొడుక్కుని వచ్చి ఎగ్జామినర్‌కు దొరికిపోయారు. మొత్తంగా 35 మంది ఈ పరీక్షలో చీటింగ్‌కు పాల్పడ్డారు.

Tags:    

Similar News