Akhilesh Yadav : సీఎం యోగి అధికారిక నివాసం కింద శివలింగం : అఖిలేష్

దిశ, నేషనల్ బ్యూరో : సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-29 12:20 GMT
Akhilesh Yadav : సీఎం యోగి అధికారిక నివాసం కింద శివలింగం : అఖిలేష్
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో : సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్నో నగరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) అధికారిక నివాసం కింద శివలింగం ఉందని విమర్శలు గుప్పించారు. అక్కడ శివలింగం ఉందని తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఎద్దేవా చేశారు. సీఎం అధికారిక నివాసం(UP CM residence) కింద తప్పకుండా తవ్వకాలు జరపాలని బీజేపీ ప్రభుత్వాన్ని అఖిలేష్ డిమాండ్ చేశారు.

లక్నోలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. సంభల్‌ పట్టణంలో తవ్వకాల పేరుతో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ప్రజలను ఇబ్బందిపెడుతోందన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తన బొందను తానే తవ్వుకుంటోందని అఖిలేష్ మండిపడ్డారు.

Tags:    

Similar News