కరోనా పరిహారంపై సుప్రీం కోర్ట్ ఫైర్

న్యూఢిల్లీ: కరోనా పరిహారంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిహారం అమలు విషయంలో దాఖలైన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ ఎంఆర్ షా, బీవీ నాగరత్నలతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ః‘మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పట్ల సంతోషంగా లేము.  రాష్ట్రంలో లక్ష మందికి పైగా  కరోనాతో మరణిస్తే కేవలం 37,000 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు ఒక్కరికి కూడా పరిహారం […]

Update: 2021-12-06 08:20 GMT

న్యూఢిల్లీ: కరోనా పరిహారంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిహారం అమలు విషయంలో దాఖలైన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ ఎంఆర్ షా, బీవీ నాగరత్నలతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.

ః‘మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పట్ల సంతోషంగా లేము. రాష్ట్రంలో లక్ష మందికి పైగా కరోనాతో మరణిస్తే కేవలం 37,000 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు ఒక్కరికి కూడా పరిహారం అందలేదు. ఇది చాలా దారుణమైన విషయం’ అని షా అన్నారు. అయితే త్వరలోనే పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్‌ను అందిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫు లాయరు సచిన్ పాటిల్ తెలిపారు. వెంటనే దరఖాస్తు చేసుకున్న వారికి పరిహారం అందించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌ ప్రభుత్వాల వైఖరిపై స్పందిస్తూ ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలని బెంచ్ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని ఆన్‌లైన్ పోర్టర్లను ఏర్పాటు చేసి వేగంగా పని చేయాలని కోర్టు సూచించింది. అంతేకాకుండా వార్త పత్రికలు, టీవీలు, రేడియోల ద్వారా పరిహార పథకం పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News