భారత్‌లో కరోనా నియంత్రణకు ఏడీబీ నిధుల మంజూరు!

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా వైరస్‌ను అరికట్టేందుకు, నివారణ చర్యల కోసం, ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలకు ఏప్రిల్‌లో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) 150 కోట్ల డాలర్ల చేయూతనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్‌లో కరోనా కట్టడికి ఏడీబీ మరో 3 మిలియన్ డాలర్లను మంజూరు చేసింది. ఆసియ పసిఫిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద భారత్‌కు ఈ నిధులను సమకూర్చినట్టు బ్యాంక్ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడిన వారిని గుర్తించడం, వారికి తగిన […]

Update: 2020-07-29 06:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా వైరస్‌ను అరికట్టేందుకు, నివారణ చర్యల కోసం, ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలకు ఏప్రిల్‌లో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) 150 కోట్ల డాలర్ల చేయూతనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్‌లో కరోనా కట్టడికి ఏడీబీ మరో 3 మిలియన్ డాలర్లను మంజూరు చేసింది. ఆసియ పసిఫిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద భారత్‌కు ఈ నిధులను సమకూర్చినట్టు బ్యాంక్ వెల్లడించింది.

కరోనా వైరస్ బారిన పడిన వారిని గుర్తించడం, వారికి తగిన చికిత్సల కోసం ఈ నిధులను వినియోగించాలని తెలిపింది. అంతేకాకుండా కరోనా టెస్టులను పెంచడం, లక్షణాలు కలిగిన వారిని వీలైనంత వేగంగా గుర్తించడానికి వెచ్చించాలని సూచించింది. కాగా, ఏడీబీ సభ్య దేశాల్లో కొవిడ్-19 నివారణకు, కట్టడికి ఈ ఏడాది ఏప్రిల్‌లో 20 బిలియన్ డాలర్లతో ‘కొవిడ్-19 పాండమిక్ రెస్పాన్స్ ఆప్షన్’ పేరుమీద ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ఇందులోంచే భారత్‌కు ఆర్థిక సాయం చేస్తోంది.

Tags:    

Similar News