కరోనాతో ఇంటెలిజెన్స్ ఏఎస్‌ఐ మృతి
దిశ, సంగారెడ్డి: జిల్లాలో కరోనా కకావికలం సృష్టిస్తోంది. వైరస్ కాటుకు ఏఎస్‌ఐ మృతి చెందాడు. అందోల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇంటలిజెన్స్ ఏఎస్సై గా విధులు నిర్వర్తిస్తున్న చాకలి వెంకటేశం.. గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఆయన స్వస్థలం వట్ పల్లి మండలం మర్వెళ్లి గ్రామం. ప్రస్తుతం వెంకటేశం భార్య గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన కుమారుడు హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు డీఎంహెచ్ ఓ మోజీరాం రాథోడ్ పేర్కొన్నారు. […]
దిశ, సంగారెడ్డి: జిల్లాలో కరోనా కకావికలం సృష్టిస్తోంది. వైరస్ కాటుకు ఏఎస్‌ఐ మృతి చెందాడు. అందోల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇంటలిజెన్స్ ఏఎస్సై గా విధులు నిర్వర్తిస్తున్న చాకలి వెంకటేశం.. గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఆయన స్వస్థలం వట్ పల్లి మండలం మర్వెళ్లి గ్రామం. ప్రస్తుతం వెంకటేశం భార్య గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన కుమారుడు హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు డీఎంహెచ్ ఓ మోజీరాం రాథోడ్ పేర్కొన్నారు. కాగా వెంకటేశం మరణించిన విషయం తెలుసుకున్న స్థానికులు, మిత్రులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.