RGV : అషూ రెడ్డితో వర్మ ఘాటు ఇంటర్వ్యూ… అక్కడ కూడా పవన్‌ని వదల్లేదుగా!

దిశ, సినిమా : ఎవ్వరేమనుకున్నా.. తనకు నచ్చినట్లు బతకడమే రాంగోపాల్ వర్మ ఫిలాసఫీ. వివాదాలు సృష్టించడంలో, వాటికి వివరణ ఇవ్వడంలో వర్మకు మించిన తోపు లేడన్నది అభిమానుల మాట. అంతేకాదు అనామకులకు ఆకాశమంత పాపులారిటీ కల్పించడంలో, మీడియా ఫోకస్‌ను క్యాప్చర్ చేయడంలో ఆయనో ఎక్స్‌పర్ట్. డైరెక్టర్‌గా ఎన్నో హైట్స్ చూసి, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ట్రెండ్ సృష్టించిన వ్యక్తి ఇలా చేయడం చాలా మందికి రుచించకపోవచ్చు. కానీ అలా ఫీలయ్యే వారందరికీ ‘నేనో నీచున్ని, నన్నెందుకు ఫాలో […]

Update: 2021-09-06 10:55 GMT

దిశ, సినిమా : ఎవ్వరేమనుకున్నా.. తనకు నచ్చినట్లు బతకడమే రాంగోపాల్ వర్మ ఫిలాసఫీ. వివాదాలు సృష్టించడంలో, వాటికి వివరణ ఇవ్వడంలో వర్మకు మించిన తోపు లేడన్నది అభిమానుల మాట. అంతేకాదు అనామకులకు ఆకాశమంత పాపులారిటీ కల్పించడంలో, మీడియా ఫోకస్‌ను క్యాప్చర్ చేయడంలో ఆయనో ఎక్స్‌పర్ట్. డైరెక్టర్‌గా ఎన్నో హైట్స్ చూసి, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ట్రెండ్ సృష్టించిన వ్యక్తి ఇలా చేయడం చాలా మందికి రుచించకపోవచ్చు. కానీ అలా ఫీలయ్యే వారందరికీ ‘నేనో నీచున్ని, నన్నెందుకు ఫాలో అవుతున్నారు?’ అని నిర్భయంగా చెప్పగలిగే క్రియేటివ్ డైరెక్టర్‌కు వివాదాలతో అంటగాకపోతే అస్సలు నిద్రపట్టదు.

అప్‌కమింగ్ యాంకర్స్, యాక్ట్రెస్‌‌తో ఇంటర్వ్యూలు చేస్తూ వారిని లైమ్‌లైట్ ‌తీసుకురావడమే పనిగా పెట్టుకున్న వర్మ.. అరియానాతో బోల్డ్ ఇంటర్వ్యూను వైరల్‌ చేసేశాడు. ఆ తర్వాత అషూ రెడ్డితో ఇంటర్వ్యూలో తొడలు బాగున్నాయంటూ కామెంట్ చేసి చెంప దెబ్బతిన్నాడు. తాజాగా అషూ రెడ్డితో ఇంటర్య్యూకు సంబంధించి సెకండ్ ప్రోమో రిలీజ్ చేసిన వర్మ.. మళ్లీ తొడల ప్రస్తావనే తెచ్చాడు. కానీ ఈసారి మాత్రం ‘లార్డ్ బాలాజీ, సత్య హరిశ్చంద్ర మీద ఒట్టేసి చెబుతున్నా.. రేపు రాత్రి 6. 09 గంటలకు రిలీజ్ చేయనున్న అషూ రెడ్డి ఫుల్ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ ప్రస్తావన ఉండదు’ అని హామీ ఇచ్చాడు.

Tags:    

Similar News