ప్రెగ్నెంట్ అయిన నటి అషూ రెడ్డి.. షాక్‌లో తల్లి

దిశ, వెబ్‌డెస్క్ : జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నటి అషూ రెడ్డి. అంతే కాకుండా డబ్ స్మాష్, యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోతో సెల‌బ్రెటీ స్టేట‌స్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే తాజాగా అషూ రెడ్డి చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు వ్యూస్ […]

Update: 2021-12-08 23:34 GMT

దిశ, వెబ్‌డెస్క్ : జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నటి అషూ రెడ్డి. అంతే కాకుండా డబ్ స్మాష్, యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోతో సెల‌బ్రెటీ స్టేట‌స్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే తాజాగా అషూ రెడ్డి చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు వ్యూస్ కోసం ఇత దారుణం వద్దమ్మా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ అషూ చేసిన వీడియో ఏంటి అనుకుంటున్నారా.. ?

అషూ అంటే తెలియని వారు ఉండరు. ఇక రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి ఈ అమ్మడుకు ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది. అయితే అషూ తాజాగా అమ్మా నేను ప్రెగ్నెంట్ అంటూ ఓ ప్రాంక్ వీడియో తీసింది. అయితే ఈ వీడియోల అషూ తన ఇంట్లో సోఫాపై ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడు వాళ్ల అమ్మ వచ్చి ఏమైంది అషూ తల్లి అని అడుగుతుంది. దానికి సమాధానంగా అషూ ఏడుస్తూ.. అమ్మా నాకు పీరియడ్స్ రావట్లేదని టెస్ట్ చేయించుకున్నాను, నేను ప్రెగ్నెంట్ అంటూ చెప్తూ ఏడుస్తుంది. మొదట్లో అషూ వాళ్ల మమ్మి నమ్మలేదు కానీ అషూ ఏడవడం చూసి అనుమానం రావడంతో ఒక్కసారిగా ఆగ్రహానికిలోనై అషూను పొట్టు పొట్టు కొడుతుంది, కాలుతో తన్నుతుంది. దీంతో చివరికి అషూనే అమ్మా ఇది ప్రాంక్ వీడియో తప్పుగా అనుకోకు అంటోంది. ఇది ఏం వీడియో.. ఇలా తీస్తారా, కొంచెం అయితే హార్టఎటాక్ వచ్చేదంటూ.. మళ్లీ కొట్టి లోపలికి వెళ్లి పోతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా, దీనిపై నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News