ఉద్రిక్తంగా మారిన 'ఆశా'ల కలెక్టరేట్‌ ముట్టడి

దిశ, విశాఖపట్నం: పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విశాఖ కలెక్టరేట్ ముట్టడికి ఆశావర్కర్లు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముందుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఆశావర్కర్లు.. ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. ఇదేక్రమంలో పోలీసులు ఆశావర్కర్లను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం జరిగి తోపులాటకు దారి తీసింది. ఈ సందర్భంగా ఆశావర్కర్ల యూనియన్‌ అధ్యక్షురాలు పి.మణి మాట్లాడుతూ చాలని జీతంతో విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలకు పని […]

Update: 2020-11-02 10:07 GMT

దిశ, విశాఖపట్నం: పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విశాఖ కలెక్టరేట్ ముట్టడికి ఆశావర్కర్లు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముందుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఆశావర్కర్లు.. ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. ఇదేక్రమంలో పోలీసులు ఆశావర్కర్లను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం జరిగి తోపులాటకు దారి తీసింది. ఈ సందర్భంగా ఆశావర్కర్ల యూనియన్‌ అధ్యక్షురాలు పి.మణి మాట్లాడుతూ చాలని జీతంతో విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలకు పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా సచివాలయాలకు తమను అప్పగించడం తగదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు కూడా వర్తింపజేయాలని కోరారు. ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎట్టకేలకు మహారాణిపేట పోలీసుల ఆధ్వర్యంలో ఆందోళనకారులను టుటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News