హైదరాబాద్‌ను యూటీ చేసేందుకు కేంద్రం యత్నం: ఒవైసీ

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేంద్రం యత్నిస్తోందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. లోక్‌సభలో జమ్ముకశ్మీర్ విభజన చట్టం సవరణ బిల్లుపై ఆయన మాట్లాడుతూ…‘ హైదరాబాద్‌ను యూటీగా మార్చే ప్రమాదం ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భవిష్యత్తులో ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చెన్నై, బెంగుళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నోను కూడా యూటీగా చేస్తారు. ఈ నగరాలను యూటీలుగా మార్చడమే బీజేపీ విధానం. జమ్ము కశ్మీర్ విభజనే బీజేపీ విధానానికి ఉదాహరణ. ఇప్పుడు […]

Update: 2021-02-14 00:20 GMT

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేంద్రం యత్నిస్తోందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. లోక్‌సభలో జమ్ముకశ్మీర్ విభజన చట్టం సవరణ బిల్లుపై ఆయన మాట్లాడుతూ…‘ హైదరాబాద్‌ను యూటీగా మార్చే ప్రమాదం ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భవిష్యత్తులో ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

చెన్నై, బెంగుళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నోను కూడా యూటీగా చేస్తారు. ఈ నగరాలను యూటీలుగా మార్చడమే బీజేపీ విధానం. జమ్ము కశ్మీర్ విభజనే బీజేపీ విధానానికి ఉదాహరణ. ఇప్పుడు చప్పట్లు కొడుతున్న సెక్యులర్ పార్టీలు..అప్పుడు గొడవ చేయడం ఖాయం. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీలు భవిష్యత్ పరిణామాలకు రెడీగా ఉండాలి’ అన్నారు.

Tags:    

Similar News