మాట తప్పకండి.. డిన్నర్ మిస్సవ్వకండి.. ఎస్పీ ఆహ్వానం

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు, వైద్యులు నిరంతరం ప్రజలకోసం సేవలు అందిస్తున్నారు. కానీ కొంతమంది నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తుంది. మాస్కులు పెట్టుకోకుండా, సామాజిక దూరం పాటించకుండా పెళ్లిళ్లు, విందులు, వినోదాలు అంటూ డాన్సులు వేస్తూ తిరుగుతున్నారు. ఒక పక్క దేశం వల్లకాడు అవుతున్నా పట్టించుకోకుండా పెళ్లి వేడుకలకు వందల మందిని పిలిచి విందు భోజనాలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో […]

Update: 2021-04-27 05:42 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు, వైద్యులు నిరంతరం ప్రజలకోసం సేవలు అందిస్తున్నారు. కానీ కొంతమంది నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తుంది. మాస్కులు పెట్టుకోకుండా, సామాజిక దూరం పాటించకుండా పెళ్లిళ్లు, విందులు, వినోదాలు అంటూ డాన్సులు వేస్తూ తిరుగుతున్నారు. ఒక పక్క దేశం వల్లకాడు అవుతున్నా పట్టించుకోకుండా పెళ్లి వేడుకలకు వందల మందిని పిలిచి విందు భోజనాలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్‌లోని బింధ్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ వారికి ఒక్క బంపర్ ఆఫర్ ఇచ్చారు.

ఎవరైతే తమ గ్రామంలో పదిమందికి మించి పిలవకుండా పెళ్లి చేసుకుంటారో వారికి స్వయంగా తమ ఇంట్లోనే డిన్నర్ ఏర్పాటు చేస్తామని, అంతేకాకుండా వారికి ప్రత్యేక మెమెంటోలను కూడా అందిస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు. కరోనాను కట్టడి చేయడానికి ఇలాంటి బంపర్ ఆఫర్ ని అందరు ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రకటన చేసి రెండు రోజులు అయినా ఒక్క జంట కూడా రాకపోవడం గమనార్హం. త్వరలో రెండు పెళ్లిళ్లు జరగనున్నాయని, వారు ఈ నిబంధనలను పాటిస్తామని తనకు మాటిచ్చారని, వాళ్ళు కనుక అలా చేస్తే మా ఇంట్లో రెండు డిన్నర్లు చేయిస్తానని తెలిపారు.

Tags:    

Similar News