టీవీ వ్యాఖ్యాతగా… అద్భుతమైన ప్రస్థానం
దిశ, వెబ్‌డెస్క్: సినీ నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న ఎస్పీ బాలు 'కేలడి కణ్మణి', 'గుణ' లాంటి అనేక చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించారు. బుల్లితెరపై కూడా సంగీత ఇతివృత్తంతో కూడిన అనేక కార్యక్రమాలను సుదీర్ఘకాలం పాటు నిర్వహించి వ్యాఖ్యాతగా, ఆ కార్యక్రమాల జడ్జీగా వ్యవహరించారు. 'ఈటీవీ'లో 'పాడుతా తీయగా.. ' కార్యక్రమాన్ని ఏకంగా 198 ఎపిసోడ్‌లు నిర్వహించారు. జెమినీ టీవీలో 'ఎందరో మహానుభావులు' పేరుతో 73 ఎపిసోడ్‌లు, 'మాటీవీ'లో 'పాడాలని ఉంది' పేరుతో 300కు పైగా […]
దిశ, వెబ్‌డెస్క్: సినీ నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న ఎస్పీ బాలు 'కేలడి కణ్మణి', 'గుణ' లాంటి అనేక చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించారు. బుల్లితెరపై కూడా సంగీత ఇతివృత్తంతో కూడిన అనేక కార్యక్రమాలను సుదీర్ఘకాలం పాటు నిర్వహించి వ్యాఖ్యాతగా, ఆ కార్యక్రమాల జడ్జీగా వ్యవహరించారు. 'ఈటీవీ'లో 'పాడుతా తీయగా.. ' కార్యక్రమాన్ని ఏకంగా 198 ఎపిసోడ్‌లు నిర్వహించారు. జెమినీ టీవీలో 'ఎందరో మహానుభావులు' పేరుతో 73 ఎపిసోడ్‌లు, 'మాటీవీ'లో 'పాడాలని ఉంది' పేరుతో 300కు పైగా ఎపిసోడ్‌లు వ్యాఖ్యాతగా నిర్వహించారు.
కన్నడ 'ఈటీవీ'లో 'యెధే తుంబి హాడువేణు' అనే కార్యక్రమానికి 403 ఎపిసోడ్‌లలో వ్యాఖ్యాతగా నిర్వహించారు. తమిళంలో జయా టీవీలో 'ఎన్నోడు పాట్టు పాడుంగళ్' కార్యక్రమానికి 150 ఎపిసోడ్‌లలో, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ సమర్పించిన 'సునాద వినోదిని' (తెలుగు) 49 ఎపిసోడ్‌లలో, ఈటీవీ తెలుగులో 'ఝుమ్మంది నాదం' అనేక కార్యక్రమానికి సుమారు పాతికి ఎపిసోడ్‌లలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.