డ్రగ్స్ కేసు విచారణలో కన్నీరుపెట్టిన ఆర్యన్‌ ఖాన్.. షారుఖ్ ఏం చేశారంటే.?

దిశ, సినిమా : షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో ఆసక్తికర నిజాలు వెల్లడవుతున్నాయి. ముంబైలోని క్రూయిజ్ పార్టీ రైడ్‌లో దొరికిన ఆర్యన్‌‌ను అరెస్టు చేసిన ఎన్‌సీబీ అధికారులు.. అతన్ని పోలీస్ రిమాండ్‌కు పంపించారు. అయితే తాజా రిపోర్టుల ప్రకారం ఆర్యన్ చాలాకాలం నుంచి మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నాడని.. యూకే, దుబాయ్‌లో ఉన్నప్పుడు కూడా తను డ్రగ్స్ యూజ్ చేశాడని పోలీసుల విచారణ వెల్లడైనట్లు తెలుస్తోంది. అయితే ఆర్యన్‌ను ముందుగా ఒక్కరోజు రిమాండ్‌కే పంపించగా, ప్రస్తుత […]

Update: 2021-10-04 03:22 GMT

దిశ, సినిమా : షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో ఆసక్తికర నిజాలు వెల్లడవుతున్నాయి. ముంబైలోని క్రూయిజ్ పార్టీ రైడ్‌లో దొరికిన ఆర్యన్‌‌ను అరెస్టు చేసిన ఎన్‌సీబీ అధికారులు.. అతన్ని పోలీస్ రిమాండ్‌కు పంపించారు. అయితే తాజా రిపోర్టుల ప్రకారం ఆర్యన్ చాలాకాలం నుంచి మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నాడని.. యూకే, దుబాయ్‌లో ఉన్నప్పుడు కూడా తను డ్రగ్స్ యూజ్ చేశాడని పోలీసుల విచారణ వెల్లడైనట్లు తెలుస్తోంది.

అయితే ఆర్యన్‌ను ముందుగా ఒక్కరోజు రిమాండ్‌కే పంపించగా, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కస్టడీ పొడిగించే అవకాశం ఉంది. ఇక ఇంటరాగేషన్ సందర్భంగా ఆర్యన్ విపరీతంగా ఏడ్చాడని, దీంతో తనను తండ్రి షారుఖ్ ఖాన్‌తో రెండు నిమిషాలు టెలిఫోన్‌లో మాట్లాడించారని తెలుస్తోంది. కాగా క్రూయిజ్ షిప్‌పై ఎన్‌సీబీ అధికారుల దాడిలో 13 గ్రాముల కొకైన్, 5 గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరాస్, 22 మత్తు కలిగించే మాత్రలతో పాటు రూ.1.33 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

 

Tags:    

Similar News