గంజాయి తరలిస్తున్న యువకుల అరెస్ట్..
దిశ, మెదక్: గంజాయి తరలిస్తున్న యువకులను అరెస్టు చేసినట్లు ఏసీపీ వాసాల సతీష్ అన్నారు. గురువారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం రాగా అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది మడత ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన పిల్లి శ్రీనివాస్, పిల్లి కళ్యాణ్ అనే ఇద్దరు […]
దిశ, మెదక్: గంజాయి తరలిస్తున్న యువకులను అరెస్టు చేసినట్లు ఏసీపీ వాసాల సతీష్ అన్నారు. గురువారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం రాగా అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది మడత ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించామన్నారు.
ఈ తనిఖీల్లో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన పిల్లి శ్రీనివాస్, పిల్లి కళ్యాణ్ అనే ఇద్దరు యువకులు ts 08 fq 5775 గల ద్విచక్రవాహనంపై 280 గ్రాముల గంజాయితో పట్టుబడినట్టు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రఘపతిరెడ్డి, ఎస్ఐ సజ్జనపు శ్రీధర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.