జనగామలో 6 బైక్‌లు దొరికినయి.. ఎలా అంటే..?

దిశ, జనగామ: జిల్లా పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు జనగామ సీఐ మల్లేష్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం జనగామ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. జనగామకు చెందిన శ్రీనివాస్, ఆర్ సందీప్, యాదాద్రి జిల్లాకు చెందిన సిద్దిరాములు జల్సాలకు అలవాటు పడి డబ్బుల సంపాదనకు జనగామ, చేర్యాల, ఆలేరు పరిసర ప్రాంతాల్లోనీ టీవీఎస్ వాహనాలతో పాటు ఇతర ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్తూ ఉండేవారు. […]

Update: 2020-07-17 03:37 GMT

దిశ, జనగామ: జిల్లా పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు జనగామ సీఐ మల్లేష్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం జనగామ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. జనగామకు చెందిన శ్రీనివాస్, ఆర్ సందీప్, యాదాద్రి జిల్లాకు చెందిన సిద్దిరాములు జల్సాలకు అలవాటు పడి డబ్బుల సంపాదనకు జనగామ, చేర్యాల, ఆలేరు పరిసర ప్రాంతాల్లోనీ టీవీఎస్ వాహనాలతో పాటు ఇతర ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్తూ ఉండేవారు. ఇదే క్రమంలో ఇటీవల జనగామలో పలువురు ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించారు. వారి నుంచి రెండు లక్షల విలువ చేసే 6 టీవీఎస్ ఎక్సెల్ వాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు రాజేష్ నాయక్, శ్రీనివాస్, రవికుమార్ ఉన్నారు.

Tags:    

Similar News