మంత్రి కేటీఆర్ కు మరోసారి నిరసన సెగ
దిశ, చార్మినార్: ఓవైసీ జంక్షన్ నుంచి మిధాని వరకు నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వెళ్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకోబోయిన బీజేపీ, బీజేవైఎం నాయకులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓవైసీ జంక్షన్ నుంచి మిధాని వరకు నూతనంగా నిర్మించిన మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వెళ్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను […]
దిశ, చార్మినార్: ఓవైసీ జంక్షన్ నుంచి మిధాని వరకు నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వెళ్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకోబోయిన బీజేపీ, బీజేవైఎం నాయకులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓవైసీ జంక్షన్ నుంచి మిధాని వరకు నూతనంగా నిర్మించిన మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వెళ్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను చాంద్రాయణగుట్ట బంగారు మైసమ్మ దేవాలయం వద్దకు చేరుకోగానే బీజేవైఎం గ్రేటర్ అధ్యక్షుడు శివచంద్రగిరి ఆధ్వర్యంలో పలువురు బీజేపీ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అక్కడే బందోబస్తులో ఉన్న చాంద్రాయణగుట్ట పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.