కరెంట్ మీటర్ రీడింగ్ ఇక ఆన్‌లైన్..

దిశ,పాలేరు: రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినూత్నంగా సెల్ఫ్‌ బిల్లింగ్‌ సిస్టంను అమలు చేయబోతున్నాయి. కోవిడ్‌ విజృంభన దృష్ట్యా సిబ్బంది ఇంటింటికి తిరిగి స్పాట్‌ బిల్లింగ్‌ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎవరి ఇంటి మీటరు రీడింగ్‌ను వారే తీసుకునేందుకు విద్యుత్ శాఖ సెల్ఫ్ రిడింగ్ సిస్టమ్‌ను అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌లను రూపోందించి విడుదల చేసింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో వినియోగదారులకు ఎస్ఎమ్ఎస్,వీడియో ద్వారా ముందుగానే అలెర్ట్ చేసింది. […]

Update: 2021-05-11 05:10 GMT

దిశ,పాలేరు: రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినూత్నంగా సెల్ఫ్‌ బిల్లింగ్‌ సిస్టంను అమలు చేయబోతున్నాయి. కోవిడ్‌ విజృంభన దృష్ట్యా సిబ్బంది ఇంటింటికి తిరిగి స్పాట్‌ బిల్లింగ్‌ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎవరి ఇంటి మీటరు రీడింగ్‌ను వారే తీసుకునేందుకు విద్యుత్ శాఖ సెల్ఫ్ రిడింగ్ సిస్టమ్‌ను అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌లను రూపోందించి విడుదల చేసింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో వినియోగదారులకు ఎస్ఎమ్ఎస్,వీడియో ద్వారా ముందుగానే అలెర్ట్ చేసింది. అయితే రాష్ట్రంలో టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ ఐటీ వింగ్, భారత్‌ సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ యాప్‌ల ద్వారా మంగళవారం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు.

కోవిడ్ 19 పరిస్థితుల్లో జనజీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైరస్ మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనితో పల్లె నుంచి పట్టణం వరకు సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని పనులు ఆన్‌లైన్ ద్వారా చేసేందుకు దారులు వెతుకుతున్నారు.

ఆన్‌లైన్ లో విద్యుత్ బిల్లులు..

తెలంగాణ విద్యుత్ డిస్కంలు తమ వినియోగదారుల విద్యుత్ బిల్లుల పంపిణి మరియు చెల్లింపును ఆన్‌లైన్ పద్ధతిలోకి తీసుకువచ్చింది. గతం ఏప్రిల్, మేలో వైరస్ వల్ల కరెంటు బిల్లులు మూడు నెలలు కలిపి జూన్ లో ఒకే సారి తీయడంతో పెద్ద మొత్తంలో విమర్శలతో పాటు భారీగా స్లాబులు పెరిగి బిల్లులు వచ్చిన పరిస్థితి కనిపించింది. దీంతో విద్యుత్ డిస్కంలు విద్యుత్ బిల్లులను క్రియోట్ చేసేందుకు స్వంతగా ఓ యాప్‌ను రూపోందించాయి. తెలంగాణలోని ఎన్పిడీసిఎల్ ముందుగా ఈ ఆప్‌ను తీసుకురాగా సదరన్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ కూడ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.

అయితే ప్రస్తుత మే నెలలోని 21లోగా స్పాట్‌ బిల్లింగ్‌ సిబ్బంది ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీయకపోతే, రెండు రోజులు వేచి చూసి ఆ తర్వాత సెల్ఫ్‌ బిల్లింగ్‌ సదుపాయాన్ని వాడుకోవాలని టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సూచిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మే నెలలో మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తున్నామని వారు చెబుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=in.tsnpdcl.tsnpdcl లింక్‌ను క్లిక్‌ చేయడం ద్వారా ‘టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ ఐటీ వింగ్‌’ అనే యాప్‌ను.. https://play.google.com/store/ apps/details? id= in.coral.met లింక్‌ను క్లిక్‌ చేయడం ద్వారా భారత్‌ మీటర్‌ రీడింగ్‌ యాప్‌ ను డౌన్‌లోడ్ చేసుకుని అనంతరం ఓపెన్‌ చేసి అందులో సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేసి ఎంపిక చేసుకోవాలి. తర్వాత వినియోగదారులు యూనిక్‌ సర్వీసు నంబర్ మరియు మొబైల్‌ నంబర్‌ను నమోదు చేయాలి.తర్వాత అందులో ఉండే స్కాన్‌ కేడబ్ల్యూహెచ్‌ రీడింగ్‌ను ఎంపిక చేసి మీటర్‌లోని రీడింగ్‌ను స్కాన్‌ చేసి సబ్‌మిట్ బటన్‌ క్లిక్‌ చేయాలి. దీంతో రీడింగ్ ఫోటో విద్యుత్ అధికారులకు వెళుతోంది. విద్యుత్ బిల్లు ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఎంటర్ చేసిన ఫోన్ నంబర్‌కు అధికారులు విద్యుత్‌ బిల్లును ఎస్‌ఎంఎస్‌ రూపంలో పంపిస్తారని చెబుతున్నారు.తద్వారా విద్యుత్ బిల్లులు కట్టే అవకాశం రానుంది.

Tags:    

Similar News