మూడు ముళ్లు వేసిన మూడు గంటల్లోనే జంప్!
దిశ, వెబ్‌డెస్క్: మూడు ముళ్లు వేసి, అగ్ని సాక్షిగా ఏడగులు వేసిన యువతి.. మూడు గంటల్లోనే కట్టుకున్న యువకుడిని వదిలేసింది. తూచ్.. నువ్వు వద్దు అంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. కోరుకున్న ప్రియుడే ముద్దు.. నువ్వు వద్దు అంటూ నవ వరుడిని నట్టింట వదిలేసింది. సినిమా ట్వీస్టులకు ఏమాత్రం తీసిపోని విధంగా నాటకీయ ఫక్కీలో జరిగిన ఈ పెళ్లి కరీంనగర్ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి […]
దిశ, వెబ్‌డెస్క్: మూడు ముళ్లు వేసి, అగ్ని సాక్షిగా ఏడగులు వేసిన యువతి.. మూడు గంటల్లోనే కట్టుకున్న యువకుడిని వదిలేసింది. తూచ్.. నువ్వు వద్దు అంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. కోరుకున్న ప్రియుడే ముద్దు.. నువ్వు వద్దు అంటూ నవ వరుడిని నట్టింట వదిలేసింది. సినిమా ట్వీస్టులకు ఏమాత్రం తీసిపోని విధంగా నాటకీయ ఫక్కీలో జరిగిన ఈ పెళ్లి కరీంనగర్ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన దివ్యను మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ప్రవీణ్ కుమార్‌తో వివాహం చేయడానికి ఇరువైపుల పెద్దలు నిర్చయించారు. ఆ సమయంలో దివ్య పెళ్లికి ఒప్పుకున్నది. వీరి వివాహం ఈనెల 24న రాత్రి బంధు మిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది. ప్రవీణ్ కుమార్‌తో కలిసి దివ్య ఏడగులు వేసింది. ఆనందోత్సహాల నడుమ జరిగిన వివాహ తంతు అనంతరం వధువరులకు బరాత్ నిర్వహించారు. సరిగ్గా అదే సమయంలో సినీ ఫక్కీలో నాటకీయ పరిమాణాలు చోటు చేసుకున్నాయి.
పెళ్లికి ముందే దివ్య.. వంశీ ప్రేమించుకున్నారు. అయితే పెద్దల నిశ్చయించిన పెళ్లిని కాదనలేక తలొంచుకుని తాళి కట్టించుకున్నది దివ్య. అప్పగింతల అనంతరం వధూవరుల ఊరేగింపులోకి ఓ యువకుడు డైరెక్ట్‌గా వచ్చి పెళ్లి కూతుకు ముద్దు పెట్టాడు. ‘నీవు ఎలా పెళ్లి చేసుకున్నావు’ అంటూ హంగామా సృష్టించాడు. దివ్యను తనకు వదిలేసి వెళ్లిపోయాలని గొడవకు దిగారు. దీంతో ఖంగుతిన్న పెళ్లి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తన లవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుసుకున్న దివ్య వెంటనే పీఎస్‌కు చేరుకున్నది. తనకు వంశే ఇష్టమని అతడితోనే ఉంటానని భీష్మించుకు కూర్చుంది. వారికి పోలీసులు, బంధువులు కౌన్సిలింగ్ చేసినా.. పెళ్లి కుమారుడితో వెళ్లడానికి దివ్య నిరాకరించింది.వంశీతోనే ఉంటానని, తామిద్దరికి వివాహం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నవ వరుడు, తల్లిదండ్రులు, బంధువులు ఆమెను పోలీస్‌స్టేషన్‌లోనే వదిలేసి వెళ్లారు. ఒంటరిగా మిగిలిన వధువును పోలీసులు కరీంనగర్‌లోని స్వధార్ హోంకు తరలించారు. వంశీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.