ఫీచర్‌ఫోన్, ల్యాండ్‌లైన్‌లోనూ ఆరోగ్య సేతు యాప్ !
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 కట్టడిలో భాగంగా కాంటాక్ట్ ట్రేసింగుని గుర్తించేందుకు ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని ఉపయోగించాలంటే ఆండ్రాయిడ్, ఐఓఎస్ సపోర్టు చేసే స్మార్ట్‌ఫోన్ కావాలి. దీంతో ఫీచర్ ఫోన్లు, ల్యాండ్‌లైన్ వాడుతున్నవారికి అందుబాటులో లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఐవీఆర్ఎస్ (ఇంటారాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. అలాగే జియో ఫోన్ల కోసం ప్రత్యేకంగా బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఆరోగ్యసేతు యాప్‌ని కూడా […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 కట్టడిలో భాగంగా కాంటాక్ట్ ట్రేసింగుని గుర్తించేందుకు ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని ఉపయోగించాలంటే ఆండ్రాయిడ్, ఐఓఎస్ సపోర్టు చేసే స్మార్ట్‌ఫోన్ కావాలి. దీంతో ఫీచర్ ఫోన్లు, ల్యాండ్‌లైన్ వాడుతున్నవారికి అందుబాటులో లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఐవీఆర్ఎస్ (ఇంటారాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. అలాగే జియో ఫోన్ల కోసం ప్రత్యేకంగా బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఆరోగ్యసేతు యాప్‌ని కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ యాప్‌ని ఐవీఆర్ఎస్ ద్వారా యాక్సెస్ చేసుకోవడానికి 1921కి డయల్ చేయాలి. తర్వాత మీ కాల్ డిస్‌కనెక్ట్ అవుతుంది. మీ ఆరోగ్య సంబంధ ప్రశ్నలు అడగడానికి కాల్ వస్తుంది. ఆరోగ్యసేతు యాప్‌లో ఉన్న ప్రశ్నలే ఇందులో కూడా ఉంటాయి. ఇచ్చిన సమాధానాల ఆధారంగా ఆరోగ్య పరిస్థితి గురించి మెసేజ్‌లు వస్తాయి. ఈ కాల్ ద్వారా తీసుకున్న ఇన్‌పుట్‌లను కూడా ఆరోగ్యసేతు డేటాబేస్‌లో జోడిస్తారు. ప్రస్తుతం ఈ సేవ 11 భాషలలో అందుబాటులో ఉంది.