‘కారు’ను ‘బండి’ బద్దలు కొట్టలేదు: జీవన్ రెడ్డి

దిశ, న్యూస్ బ్యూరో: స్థానిక ఎన్నికల్లోనే బీజేపీకి ప్రజలు గోరికట్టారనీ, అలాంటి పార్టీకి రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్న బండి సంజయ్.. టీఆర్ఎస్ గోడలు బద్దలు కొడతాం అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. బీజేపీది బండి అయితే, తమది కారనీ, కారును బండి బద్దలు కొట్టలేదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ వయసు కేసీఆర్ రాజకీయ అనుభవమంత కూడా ఉండదనీ, అధ్యక్షుడిగా వచ్చి 24గంటలు కాకముందే మితిమీరి మాట్లాడడం అవివేకమని […]

Update: 2020-03-16 01:46 GMT

దిశ, న్యూస్ బ్యూరో: స్థానిక ఎన్నికల్లోనే బీజేపీకి ప్రజలు గోరికట్టారనీ, అలాంటి పార్టీకి రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్న బండి సంజయ్.. టీఆర్ఎస్ గోడలు బద్దలు కొడతాం అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. బీజేపీది బండి అయితే, తమది కారనీ, కారును బండి బద్దలు కొట్టలేదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ వయసు కేసీఆర్ రాజకీయ అనుభవమంత కూడా ఉండదనీ, అధ్యక్షుడిగా వచ్చి 24గంటలు కాకముందే మితిమీరి మాట్లాడడం అవివేకమని వెల్లడించారు. అధ్యక్షుడిగా తన ప్రణాళికలేంటో చెప్పకుండా, మతిభ్రమించి ఇతరులపై విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా సంజయ్ మాట్లాడుతున్నారని తెలిపారు. దమ్ముంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రప్పించాలని సవాలు విసిరారు.

Tags: armur mla, jeevan reddy, TRS, car, bjp, kcr,

Tags:    

Similar News