కరోనా : దేశవ్యాప్తంగా ఆస్పత్రులపై పూల వర్షం

న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తో ముందుండి పోరాడుతున్న యుద్ధ వీరులను భారత్ వినూత్నంగా సత్కరించింది. ప్రాణాలకు తెగించి ఈ వైరస్‌పై పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా త్రివిధ దళాలు పూల వర్షం కురిపించాయి. కరోనా యుద్ధ వీరులను గౌరవిస్తూ వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు ఆస్పత్రుల మీదుగా పూలు కురిపిస్తూ దూసుకెళ్లాయి. కొన్ని చోట్ల వైమానిక దళ సిబ్బంది ఆస్పత్రి సిబ్బందిని సత్కరించారు. దేశవ్యాప్తంగా ఈ విమానాలు.. ఉత్తరాన శ్రీనగర్ […]

Update: 2020-05-03 01:33 GMT

న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తో ముందుండి పోరాడుతున్న యుద్ధ వీరులను భారత్ వినూత్నంగా సత్కరించింది. ప్రాణాలకు తెగించి ఈ వైరస్‌పై పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా త్రివిధ దళాలు పూల వర్షం కురిపించాయి. కరోనా యుద్ధ వీరులను గౌరవిస్తూ వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు ఆస్పత్రుల మీదుగా పూలు కురిపిస్తూ దూసుకెళ్లాయి. కొన్ని చోట్ల వైమానిక దళ సిబ్బంది ఆస్పత్రి సిబ్బందిని సత్కరించారు. దేశవ్యాప్తంగా ఈ విమానాలు.. ఉత్తరాన శ్రీనగర్ మొదలు దక్షిణాన తిరువనంతపురం, తూర్పున దిబ్రూగఢ్ నుంచి పశ్చిమాన కచ్ వరకు వీరవిహంగం చేస్తూ గౌరవ వందనాలు చేశాయి. పూలు కురిపించాయి. కాగా, సీ 130 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఢిల్లీలోని రాజ్‌పత్ మీదుగా వెళ్లాయి. కరోనా యుద్ధ వీరులకు సైనిక దళాలు కృతజ్ఞతలు తెలుపుతాయని సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ శుక్రవారం పేర్కొన్న విషయం తెలిసిందే.

శ్రీనగర్‌లో ఉదయం 10 గంటల ప్రాంతంలో దాల్ లేక్ మీదుగా హెలికాప్టర్ విహంగం చేసింది. ఛండీగడ్‌లో రెండు సీ 130జే సూపర్ హర్క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు వెళ్లాయి. ఇదే సమయంలో కరోనా ఆపత్కాలంలో దేశవ్యాప్తంగా లా అండ్ ఆర్డర్‌ను అదుపులో పెడుతున్న పోలీసులకూ వైమానిక దళం సలాం కొట్టింది. ఢిల్లీలోని పోలీసుల యుద్ధ స్మారక నిర్మాణంపై పూలు కురిపించాయి. హర్యానాలోని పంచకులలో ప్రభుత్వ ఆస్పత్రిపై నుంచి ఐఏఎఫ్ హెలికాప్టర్ వెళ్లింది. కాగా, గోవా రాజధానిలోని మెడికల్ కాలేజీపై భారత నౌకా దళానికి చెందిన కొత్త హెలికాప్టర్‌లు పూలు కురిపిస్తూ కరోనా యుద్ధ వీరులకు అరుదైన గౌరవ వందనం చేశారు. ఇంకా ఢిల్లీ, ముంబయి, లక్నో, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఆస్పత్రులపై హెలికాప్టర్‌లు పూల వర్షం కురిపిస్తూ ఎగురుతూ వెళ్లాయి. బంగాళాఖాతంలో ఐఎన్ఎస్ జలశ్వా నౌకపై థాంక్ యూ అని రాసి వైద్యులు, నర్సులు, మెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు.

Tags: coronavirus, tribute, aircraft, flypast, hospitals, flowers, shower

Tags:    

Similar News