స్పోర్ట్స్ కార్ రేసులో తొలి భారత రేసర్ అతడే..!

దిశ, స్పోర్ట్స్ : స్పోర్ట్స్ కార్ రేసులో చోటు సంపాదించిన తొలి భారత డ్రైవర్‌గా అర్జున్ మైనీ రికార్డు సృష్టించాడు. గతంలో ఫార్ములా 2 రేసర్‌గా ఉన్న అర్జున్ మైనీ 2019లో స్పోర్ట్స్ కార్ రేసర్‌గా మారాడు. తాజాగా డీటీఎం సిరీస్ 2021 సీజన్‌లో మెర్సిడెజ్-ఏఎంజీ జట్టు తరపున ఫుల్‌టైమ్ రేసర్‌గా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇండియాకు చెందిన ఒక రేసర్ డీటీఎం కార్ చాంపియన్‌షిప్‌లో డ్రైవర్‌గా మారడం ఇదే తొలి సారి. మెర్సిడెస్-ఏఎంజీ జట్టు గెట్ స్పీడ్ […]

Update: 2021-03-26 09:00 GMT

దిశ, స్పోర్ట్స్ : స్పోర్ట్స్ కార్ రేసులో చోటు సంపాదించిన తొలి భారత డ్రైవర్‌గా అర్జున్ మైనీ రికార్డు సృష్టించాడు. గతంలో ఫార్ములా 2 రేసర్‌గా ఉన్న అర్జున్ మైనీ 2019లో స్పోర్ట్స్ కార్ రేసర్‌గా మారాడు. తాజాగా డీటీఎం సిరీస్ 2021 సీజన్‌లో మెర్సిడెజ్-ఏఎంజీ జట్టు తరపున ఫుల్‌టైమ్ రేసర్‌గా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇండియాకు చెందిన ఒక రేసర్ డీటీఎం కార్ చాంపియన్‌షిప్‌లో డ్రైవర్‌గా మారడం ఇదే తొలి సారి. మెర్సిడెస్-ఏఎంజీ జట్టు గెట్ స్పీడ్ పేరుతో పాల్గొననున్నది. జర్మని, యూరోప్‌లో మొత్తం 16 రేసులు డీటీఎం సీజన్‌లో జరుగుతాయి. 2015లో ఫార్ములా 3 రేసర్‌గా ఉంటూనే డీటీఎం సీజన్‌లో పాల్గొన్న అనుభవం తనకు పనికి వస్తుందని అర్జున్ మైనీ చెబుతున్నాడు.

Tags:    

Similar News