అర్చి@ మిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్
దిశ, ఫీచర్స్ : ‘ట్రాన్స్‌ఉమెన్’ అనే పేరు వినగానే సమాజం నుంచి ఛీత్కారాలు, అవమానాలతో పాటు వివక్ష కూడా ఎదురవుతుంది. అసలు వారిని మనుషులుగా గుర్తించడానికే ఇష్టపడని వారి మధ్యనే సగర్వంగా సమాజం మెప్పుకొలు పొందే ‘ట్రాన్స్‌ఉమెన్స్’ ఎంతోమంది. ఈ క్రమంలో దక్షిణ అమెరికాలోని కొలంబియాలో జరిగిన ‘మిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్’ 2021 పోటీల్లో భారత్‌కు చెందిన 22 ఏళ్ల అర్చీ సింగ్ ట్రాన్స్‌ఉమన్ రన్నరప్‌గా నిలిచి, ఈ ఘనత పొందిన తొలి భారతీయురాలిగా నిలిచింది. ఢిల్లీలోని […]
దిశ, ఫీచర్స్ : ‘ట్రాన్స్‌ఉమెన్’ అనే పేరు వినగానే సమాజం నుంచి ఛీత్కారాలు, అవమానాలతో పాటు వివక్ష కూడా ఎదురవుతుంది. అసలు వారిని మనుషులుగా గుర్తించడానికే ఇష్టపడని వారి మధ్యనే సగర్వంగా సమాజం మెప్పుకొలు పొందే ‘ట్రాన్స్‌ఉమెన్స్’ ఎంతోమంది. ఈ క్రమంలో దక్షిణ అమెరికాలోని కొలంబియాలో జరిగిన ‘మిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్’ 2021 పోటీల్లో భారత్‌కు చెందిన 22 ఏళ్ల అర్చీ సింగ్ ట్రాన్స్‌ఉమన్ రన్నరప్‌గా నిలిచి, ఈ ఘనత పొందిన తొలి భారతీయురాలిగా నిలిచింది.
ఢిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అర్చీ సింగ్, పదిహేడేళ్ల వయస్సులో తన సెక్సువల్ ఐడెంటిటీని బయటపెట్టింది. ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకొని పూర్తిగా అమ్మాయిలా మారిపోయి మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. అయితే ఆమె అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంది. తను మహిళే కాదంటూ హేళన చేసినా, తన కెరీర్‌కు ఎంతోమంది అడ్డుగోడగా నిలిచినా, ప్రతీసారి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని ముందుకు సాగిపోయింది. మోడలింగ్ కెరీర్ ప్రారంభించకముందు ప్రజల్లో ట్రాన్స్‌జెండర్లపై ఉండే ఎన్నో అపోహలు, అనుమానాలను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. మోడలింగ్‌లోకి వచ్చాక అవేర్‌నెస్ కార్యక్రమాలను మరింత విస్తృత పరిచింది. ఈ క్రమంలో కెరీర్‌లో సక్సెస్ సాధిస్తూ మిస్ ట్రాన్స్ ఇండియా కిరీటం దక్కుంచుకుంది. మిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్–2021లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించే అరుదైన అవకాశాన్ని పొందింది. తాజాగా అక్కడ కూడా తన సత్తా చాటి, రన్నరప్‌గా నిలిచింది ఆర్చి.
‘అందాల పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు చాలా గర్వంగా ఉంది. టైటిల్‌ను గెలిచినందుకు సంతోషంగా ఉంది. అంతర్జాతీయ వేదికపై ఎల్‌జిబిటిక్యూఐ+ కమ్యూనిటీకి, భారతదేశ మహిళల స్వరంగా నిలిచినందుకు చాలా గొప్పగా అనిపిస్తుంది. భారతదేశం నుంచి ట్రాన్స్‌ఉమెన్ మోడల్స్ కోసం నిరంతరాయంగా పనిచేయడానికి నాపై చాలా పెద్ద బాధ్యత ఉంది. మాకు గౌరవం ఉంది, మేము కంప్లీట్ ఉమెన్స్. సెక్సువాలిటీ ఆధారంగా మనిషికి గుర్తింపు ఇవ్వొద్దు. ఏదేమైనా, ట్రాన్స్-స్పెసిఫిక్ పోటీ మాకు అంతర్జాతీయ విజిబిలిటీ అందించడంతో పాటు సమానత్వం గురించి మాట్లాడటానికి ఓ గొంతుకను ఇచ్చింది. ఈ రోజు నేను ఈ అందమైన కిరీటాన్ని ధరించాను, కానీ దీన్ని సాధించడానికి, నేను కష్టపడాల్సి వచ్చింది, అవమానాలు, వివక్షను ఎదుర్కోవలసి వచ్చింది. భారతదేశంపై నాకున్న ప్రేమ, నేను చేసిన కృషి నన్ను ఇంత దూరం తీసుకువచ్చాయి. నేను మన జెండాను పట్టుకున్నప్పుడు, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా, పవర్‌ఫుల్‌గా భావించాను. భారతీయ సంస్కృతి ఎప్పుడూ మనల్ని గౌరవిస్తోంది. నా విజయం మన సమాజంలో, బ్యూరోక్రసీలో ట్రాన్స్‌ఉమెన్లపై ఉన్న కళంకాలను పరిష్కరిస్తుందని ఆశిద్దాం. మరింతమంది యువ ట్రాన్స్ మోడళ్లను తయారు చేసి, అంతర్జాతీయ పోటీలకు పంపించాలనుకుంటున్నాను, అక్కడ వాళ్లు తమ ప్రతిభను చూపుతారు. తమ మనసులోని మాటలను బయటపెడతారు. మార్పును ప్రేరేపిస్తారు. మానుషి చిల్లార్, సుష్మితాసేన్, ఐశ్వర్య రాయ్, లారా దత్తాలు నాకు స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పుడు నా ఎల్‌జిబిటిక్యూఐ కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా ఉందని, ప్రపంచం నా కుటుంబం అని గర్వంగా చెప్పగలను’ అని తన జర్నీ గురించి ప్రసంగించింది అర్చి.