క్యాన్సల్ కల్చర్ : చేతిలో సిగరెట్‌తో సెలబ్రిటీలు కనిపిస్తే

దిశ, సినిమా : హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ క్యాన్సల్ కల్చర్‌ను తప్పుపట్టాడు. సోషల్ మీడియా సెలబ్రిటీలను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదన్నాడు. మొహంలేని వ్యక్తులు సోషల్ మీడియా పేరుచెప్పి సెలబ్రిటీలతో పాటు వారి ఫ్యామిలీలను కించపరిచేందుకు వెనుకాడరని ఫైర్ అయ్యాడు. పార్కింగ్ లేని జోన్‌లో వెహికిల్ పార్క్ చేస్తే వచ్చే ట్రోలింగ్, ఎదురయ్యే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నాడు. ‘ఒక రోల్ మోడల్ ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటాడు?’ అని వారంరోజుల పాటు టార్గెట్‌చేసి […]

Update: 2021-07-14 06:24 GMT

దిశ, సినిమా : హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ క్యాన్సల్ కల్చర్‌ను తప్పుపట్టాడు. సోషల్ మీడియా సెలబ్రిటీలను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదన్నాడు. మొహంలేని వ్యక్తులు సోషల్ మీడియా పేరుచెప్పి సెలబ్రిటీలతో పాటు వారి ఫ్యామిలీలను కించపరిచేందుకు వెనుకాడరని ఫైర్ అయ్యాడు. పార్కింగ్ లేని జోన్‌లో వెహికిల్ పార్క్ చేస్తే వచ్చే ట్రోలింగ్, ఎదురయ్యే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నాడు. ‘ఒక రోల్ మోడల్ ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటాడు?’ అని వారంరోజుల పాటు టార్గెట్‌చేసి కెరియర్‌ను నాశనం చేసేదాక వదలరన్నాడు. ఈ పరిణామాలతో కంపెనీలు అడ్వర్‌టైజ్‌మెంట్ నుంచి డ్రాప్ చేస్తే, మేకర్స్ సినిమా చాన్స్‌లు ఇవ్వరని తెలిపాడు. వాస్తవానికి ‘నో పార్కింగ్ జోన్’లో వెహికిల్ పార్క్ చేస్తే సామాన్యులకు కేవలం రూ.250 జరిమానా పడుతుంది. కానీ, సెలబ్రిటీలకు వేసే జరిమానా చాలా దారుణంగా ఉంటుందని వివరించాడు. సెలబ్రిటీలు చేతిలో సిగరెట్‌తో కనిపించారో.. లైఫ్ ఎండ్ అయినట్లే. ‘సెలబ్రిటీ ఇలా ఉండకూడదు.. అలా తినకూడదు.. ఎందుకట్ల డ్రైవ్ చేశాడు.. అలా మాట్లాడాల్సిన అవసరముందా? సామాన్యుడితో ప్రవర్తించే విధానం ఇదేనా?’ ఇలాంటి ప్రశ్నలు రోజూ ఎదురవుతూనే ఉంటాయన్నాడు.

Tags:    

Similar News