అరకు ఎమ్మెల్యే హత్య కేసులో కీలక పరిణామం
అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడు మావోయిస్టు నేత సాంబ ఖరా అలియాస్ రణదేవ్ బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇతను ఇప్పటికే 12 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని మల్కనగిరి ఎస్పీ తెలిపారు. రణదేవ్‌తో పాటు మరో ఏడుగురు మావోలు లొంగిపోయినట్లు సమాచారం. కాగా, 2018 సెప్టెంబర్‌లో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిడారి, సోమను లివిటిపుట్ట వద్ద అడ్డగించిన మావోయిస్ట్‌లు […]
అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడు మావోయిస్టు నేత సాంబ ఖరా అలియాస్ రణదేవ్ బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇతను ఇప్పటికే 12 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని మల్కనగిరి ఎస్పీ తెలిపారు. రణదేవ్‌తో పాటు మరో ఏడుగురు మావోలు లొంగిపోయినట్లు సమాచారం. కాగా, 2018 సెప్టెంబర్‌లో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిడారి, సోమను లివిటిపుట్ట వద్ద అడ్డగించిన మావోయిస్ట్‌లు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.
Tags: araku, mla, murder case, accused Surrendered, ap news