అరైజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం
దిశ, హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో.. తలసీమియా బాధితులకు బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు పడిపోయినట్టుగా ప్రభుత్వం ప్రకటనకు స్పందించిన అరైజ్ ఫౌండేషన్.. 14 యూనిట్ల రక్తాన్ని అందజేసింది. అరైజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం విద్యానగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశారు. ఫౌండేషన్ సభ్యులైన 14 మంది యువకుల నుంచి బ్లండ్ బ్యాంక్ ఇన్‌చార్జి పిచ్చిరెడ్డి రక్తాన్ని సేకరించారు. సమాజమంతా ఆపత్కాలంలో ఉన్నప్పుడు యువత బాధ్యతగా వ్యవహారించాలని ఫౌండేషన్ […]
దిశ, హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో.. తలసీమియా బాధితులకు బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు పడిపోయినట్టుగా ప్రభుత్వం ప్రకటనకు స్పందించిన అరైజ్ ఫౌండేషన్.. 14 యూనిట్ల రక్తాన్ని అందజేసింది. అరైజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం విద్యానగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశారు. ఫౌండేషన్ సభ్యులైన 14 మంది యువకుల నుంచి బ్లండ్ బ్యాంక్ ఇన్‌చార్జి పిచ్చిరెడ్డి రక్తాన్ని సేకరించారు. సమాజమంతా ఆపత్కాలంలో ఉన్నప్పుడు యువత బాధ్యతగా వ్యవహారించాలని ఫౌండేషన్ సభ్యుడైన హైదరాబాద్ కవాడిగూడకు చెందిన నీలకంఠ అన్నారు. ‘తమ ఫౌండేషన్ నుంచి ఇప్పటికే అనేక దఫాలుగా రక్తదాన శిబిరాలు నిర్వహించినా.. ప్రభుత్వ పిలుపులో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని’ అన్నారు.
Tags : Arise Foundation, Blood donation, Vidyanagar Redcross blood bank, Corona, thalassemia