సెక్రటేరియట్ నిర్మాణానికి రిటైర్డ్ ఎస్ఈ నియామకం

దిశ, న్యూస్‌బ్యూరో: కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పుడున్న అధికారులను కాదని రోడ్లు భవనాల శాఖలో గతంలో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా పనిచేసి రిటైర్ అయిన సత్యనారాయణ అనే అధికారిని తీసుకొచ్చి సెక్రటేరియట్ నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక ఎస్ఈగా నియమించింది. ఈ అధికారి కోసం ఒక సంవత్సర కాలం పాటు ఆర్ అండ్ బీ పరిపాలన చీఫ్ ఇంజనీర్ (అడ్మినిస్ట్రేషన్ అండ్ క్వాలిటీ కంట్రోల్) కార్యాలయంలో సూపర్ […]

Update: 2020-08-17 10:42 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పుడున్న అధికారులను కాదని రోడ్లు భవనాల శాఖలో గతంలో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా పనిచేసి రిటైర్ అయిన సత్యనారాయణ అనే అధికారిని తీసుకొచ్చి సెక్రటేరియట్ నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక ఎస్ఈగా నియమించింది. ఈ అధికారి కోసం ఒక సంవత్సర కాలం పాటు ఆర్ అండ్ బీ పరిపాలన చీఫ్ ఇంజనీర్ (అడ్మినిస్ట్రేషన్ అండ్ క్వాలిటీ కంట్రోల్) కార్యాలయంలో సూపర్ న్యూమరీ పోస్టును ప్రభుత్వం సృష్టించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి డి. రోనాల్డ్ రోస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ సంవత్సరం పాటు లేదా నిర్మాణం పూర్తయ్యేవరకు ఏది ముందుగా జరిగితే అంతవరకు విధులు నిర్వహించనున్నారని జీవోలో పేర్కొన్నారు.

Tags:    

Similar News