జూనియర్ కాలేజీలకు కాంట్రాక్ట్ లెక్చరర్ల నియామకాలు
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2020-21 విద్యా సంవత్సరానికి పనిచేసిన కాంట్రాక్ట్లెక్చరర్లను 2021-22 విద్యాసంవత్సారానికి కొనసాగించేందుకు ఉన్నత విద్యా మండలికి ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు ఏడు కేటగిరీలకు చెందిన 4036 మంది ఉద్యోగులను నియమించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రోనాల్డ్రాస్ఉత్వర్వులు జారీ చేశారు. కేటగిరీల వారీగా 3584 మంది కాంట్రాక్ట్ఫ్యాకల్టీ, 272 మంది పార్ట్‌టైం జూనియర్‌లెక్చరర్లకు, హవర్లీ బేసిస్‌లో […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2020-21 విద్యా సంవత్సరానికి పనిచేసిన కాంట్రాక్ట్లెక్చరర్లను 2021-22 విద్యాసంవత్సారానికి కొనసాగించేందుకు ఉన్నత విద్యా మండలికి ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు ఏడు కేటగిరీలకు చెందిన 4036 మంది ఉద్యోగులను నియమించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రోనాల్డ్రాస్ఉత్వర్వులు జారీ చేశారు.
కేటగిరీల వారీగా 3584 మంది కాంట్రాక్ట్ఫ్యాకల్టీ, 272 మంది పార్ట్‌టైం జూనియర్‌లెక్చరర్లకు, హవర్లీ బేసిస్‌లో పనిచేస్తున్న 55 మందికి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వేతనం అందుకుంటున్న 47 మంది లెక్చరర్లకు, 78 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందికి మొత్తంగా 4036 మందికి లబ్ధి చేకూరనుంది. ఆయా జిల్లాల కళాశాలల్లో సబ్జెక్టులవారీగా కాంట్రాక్టు లెక్చరర్లను నియమించాలని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.