ఆపిల్ సొంత సెర్చింజన్?

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌లో ఏదన్నా వెతకాలంటే మొదట గుర్తొచ్చేది గూగుల్ సెర్చింజన్. ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎలాగూ గూగుల్ వాళ్లవే కాబట్టి అందులో అది డీఫాల్ట్ సెర్చింజన్‌గా ఉంటుంది. అలాగే ఆపిల్ డివైజ్‌లలో కూడా గూగుల్ సెర్చింజన్ ప్రధాన సెర్చ్ ఆప్షన్‌గా ఉంది. ఇలా ఉండటం కోసం ప్రతి ఏటా పది నుంచి పన్నెండు బిలియన్ డాలర్లను గూగుల్, ఆపిల్‌కు చెల్లిస్తోంది. అయితే ఈ ఒప్పందం త్వరలో ముగియనుంది. అలాగే గూగుల్ మీద యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ […]

Update: 2020-10-29 07:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌లో ఏదన్నా వెతకాలంటే మొదట గుర్తొచ్చేది గూగుల్ సెర్చింజన్. ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎలాగూ గూగుల్ వాళ్లవే కాబట్టి అందులో అది డీఫాల్ట్ సెర్చింజన్‌గా ఉంటుంది. అలాగే ఆపిల్ డివైజ్‌లలో కూడా గూగుల్ సెర్చింజన్ ప్రధాన సెర్చ్ ఆప్షన్‌గా ఉంది. ఇలా ఉండటం కోసం ప్రతి ఏటా పది నుంచి పన్నెండు బిలియన్ డాలర్లను గూగుల్, ఆపిల్‌కు చెల్లిస్తోంది. అయితే ఈ ఒప్పందం త్వరలో ముగియనుంది. అలాగే గూగుల్ మీద యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ వేసిన యాంటీ ట్రస్ట్ కేసు కారణంగా ఈ ఒప్పందాన్ని కొనసాగించవద్దని ఆపిల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆపిల్ డివైజ్‌లలో సెర్చ్ చేయడానికి ప్రత్యామ్నాయంగా ఒక సెర్చింజన్ కావాలి కదా?

అందుకే తామే సొంతంగా ఒక సెర్చింజన్ అభివృద్ధి చేయాలని ఆపిల్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ దిశగా పనులు ముమ్మరం అయినట్లు కూడా తెలుస్తోంది. ఆపిల్‌బాట్ పేరుతో 2014లోనే వార్తల్లో నిలిచిన ఆపిల్ సెర్చింజన్ ప్రోగ్రామ్‌ను ఇప్పుడు పూర్తి స్థాయిలో డెవలప్ చేయనున్నారు. అలాగే మూడేళ్ల క్రితం గూగుల్ సెర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చీఫ్‌ జాన్ జియాన్నాండ్రాను ఆపిల్ తమ సంస్థలోకి లాక్కున్న సంగతి తెలిసిందే. అంటే ఆపిల్ సొంతంగా సెర్చింజన్ తీసుకొచ్చే ప్లాన్ మూడేళ్ల క్రితమే అమలు చేయడం ప్రారంభించిందని అనుకోవచ్చు. అయితే ఆ సెర్చింజన్ ఎలా ఉంటుంది, దాని రూపురేఖలు, పనితీరు ఎలా ఉంటుందనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

Tags:    

Similar News