యాపిల్ తయారీ కంపెనీ పెగట్రాన్ భారీ పెట్టుబడులు

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ తయారీ సంస్థ పెగట్రాన్ భారత్‌లో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది. యాపిల్ ఉత్పత్తులను తయారుచేస్తున్న రెండో భారీ సంస్థ పెగట్రాన్ రూ. 1,100 కోట్ల పెట్టుబడులను భారత్‌లో పెట్టడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. 2021 రెండో భాగంలో కంపెనీ ప్లాంట్ నుంచి ఉత్పత్తిని ప్రారంభిస్తుందని, రానున్న రెండేళ్లలో మరిన్ని పెట్టుబడులను పెట్టేందుకు కంపెనీ యోచిస్తోందని పెగట్రాన్ సీఈవో లియావో సి-జింగ్ ఇదివరకు ఓ సమావేశంలో వెల్లడించారు. తాజా పెట్టుబడుల కోసం సంస్థ […]

Update: 2020-11-23 10:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ తయారీ సంస్థ పెగట్రాన్ భారత్‌లో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది. యాపిల్ ఉత్పత్తులను తయారుచేస్తున్న రెండో భారీ సంస్థ పెగట్రాన్ రూ. 1,100 కోట్ల పెట్టుబడులను భారత్‌లో పెట్టడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. 2021 రెండో భాగంలో కంపెనీ ప్లాంట్ నుంచి ఉత్పత్తిని ప్రారంభిస్తుందని, రానున్న రెండేళ్లలో మరిన్ని పెట్టుబడులను పెట్టేందుకు కంపెనీ యోచిస్తోందని పెగట్రాన్ సీఈవో లియావో సి-జింగ్ ఇదివరకు ఓ సమావేశంలో వెల్లడించారు. తాజా పెట్టుబడుల కోసం సంస్థ గవర్నింగ్ బాడీ ఆమోదం తెలిపినట్లు, దీనికోసం చెన్నైలో అనుబంధ సంస్థను ఏర్పాటుచేసినట్టు సమాచారం. కాగా, యాపిల్ అసెంబ్లింగ్ సంస్థలైన ఫాక్సాన్, విస్ట్రాన్ ఇదివరకే భారత్‌లో ఉత్పత్తి కర్మాగారాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News